మండల కేంద్రమైన గట్టుతోపాటు అన్ని గ్రామాల్లో హోలీ పండుగను శుక్రవారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కుల మతాలకు అతీతంగా.. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఒకరినొకరు రంగులు చల్లుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతకుముందు గురువారం రాత్రి కాముని చిత్రపటాన్ని భాజా భజంత్రీలతో ఊరేగించి కామ దహనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కొంతమంది ఆకతాయిలు హోలీ పండుగ సందర్భంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. ఇళ్ళ ముందు కుండలు, వ్యర్థ పదార్థాలు పారవేసి ఇక్కట్లకు గురి చేశారు. రంగులకు బదులు కోడిగుడ్లు వేసి అసౌకర్యానికి గురి చేశారు. హోలీ పండుగ అంటేనే తమకు ఇబ్బందికరంగా మారిందని ఆకతాయిలను కట్టడి చేయాలని పలువురు సోషల్ మీడియా వేదికగా పోలీసులను కోరారు.