దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
రైతుబీమా చెక్కులు పంపిణీ
భూత్పూర్, ఫిబ్రవరి 12 : రైతన్న సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. భూత్పూర్లోని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ నివాసంలో శనివారం పలువురికి రైతుబీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ భూత్పూర్ మండలంలోని శేరిపల్లి-బీ గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్, నర్సింగాపూర్‌కు చెందిన మేకల రామస్వామి, సిద్దాయపల్లికి చెందిన నాగమ్మ వివిధ కారణాలతో మృతి చెందగా, ప్రభుత్వం వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రైతుబీమాను మంజూరు చేసిందని తెలిపారు. ప్రభుత్వం అమ లు చేస్తున్న రైతుబీమా పథకం రైతుల కుటుంబాలకు భరోసాగా నిలిచిందన్నారు. రైతుల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహగౌడ్, కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ, ఏవో మురళీధర్, కోఆప్షన్ సభ్యుడు అజీజ్, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, సాయిలు, చంద్రశేఖర్‌గౌడ్, సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్, గడ్డం రాములు, వెంకట్రాములు, బోరింగ్ నర్సింహులు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.