రిమాండ్కు తరలింపు
11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన జోగుళాంబ గద్వాల ఎస్పీ రంజన్త్రన్కుమార్
గద్వాల న్యూటౌన్, ఏప్రిల్ 11 : హ్యాం డిల్ లాక్ లేని ద్విచక్ర వాహనాలను టా ర్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. నిందితుడి వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రంజన్త్రన్ కుమార్ మీడియాకు వెల్లడించారు. అయిజ మండలం తుపత్రాల గ్రామానికి చెందిన వడ్డే వెంకటేశ్ గత కొంతకాలంగా వివిధ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి హ్యాండిల్ లాక్లేని, కిక్రాడ్ కలిగి ఉన్న వాహనాలను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడేవాడు. అయితే ఈ నెల 5న గద్వాల మండలం రేపల్లె గ్రామానికి చెందిన బోయ సత్యన్న గ ద్వాల శివారులోని జమ్మిచేడు సమీపంలోని జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చి బైక్పై పార్క్ చేసి వెళ్లి.. తిరిగిరాగా అప్పటికే గుర్తుతెలియ ని వ్యక్తులు తన బైకును అపహరించినట్లు గుర్తించి గద్వాల రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. నిందితుడు వడ్డే వెంకటేశ్ బైక్ను చోరీ చేసినట్లు తెలుసుకొని తన సొంతూరిలో ఇంటి వద్ద ఉన్నట్లు గుర్తిం చి అదుపులోకి తీసుకొని విచారించగా… పలు ప్రాంతాల్లో చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. నిందితుడు కర్నూల్ టూ టౌన్, ఇటిక్యాల, గద్వాలలో చోరీలకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. నిందితు డి నుంచి 11బైకులను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ రంగస్వామి, రూరల్ ఎస్సై ఆనంద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
–