గద్వాల, జూలై 4 : గద్వాల మార్కెట్ యార్డు ప్రహరీ కూల్చివేత వివాదం కొనసాగుతుండగానే మార్కెట్ యార్డు స్థలంలో ప్రైవేట్ హోటల్ ప్రారంభం వివాదంగా మారుతుంది. పట్టణ నడిబొడ్డున మార్కెట్ ప్రహరీ కూల్చి హోటల్ ప్రారంభించిన ఇక్కడి అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడంతో అ ధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. పాలకుల అండదండలు, అధికారుల ఉదాసీనత కారణంగా పట్టణంలో ప్రైవేట్ స్థలాలు కబ్జా చేస్తూ పాగా వేస్తున్నారు. ఆక్రమించుకున్నోనిదే స్థలం అన్నచందగా గద్వాల భూ కబ్జాల పర్వం కొనసాగుతుం ది. గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటీ గోడ కూ ల్చివేత పై తీర్మానం మినిట్స్ పుస్తకంలో రాయకుం డా తెల్లకాగితంపై రాసి నమ్మించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇందుకు బాధ్యులైనా పాలకవర్గంపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీనికి తోడు ము న్సిపల్, మార్కెట్ అధికారుల అనుమతులు లేకుం డా మార్కెట్ రక్షణ గోడ కూల్చిన వ్యాపారులకు నో టీసులు జారీ చేసి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన విషయంలో క్రిమినల్ కేసులు నమోదు చేయించడానికి మార్కెట్శాఖ ఉన్నతాధికారులు పూనుకున్నారు. మార్కెట్ రక్షణ గోడ వివరాల లోకి వెళ్తే…1956లో గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటుకు 62.26 ఎకరాలు సేకరించారు. మార్కెట్ యార్డులో భవనాలు, ప్రహరీకి మధ్య బండ్లబాట ఉంది. దీనిని విక్రయించాలని 2016లో వ్యాపారులు దరఖాస్తు లు చేసుకున్నారు.
9జూలై 2018న 26మంది వ్యా పారులకు వారి వారి భవనం వెనక వైపు ఉన్న స్థలం గజం రూ.7200 ప్రకారం విక్రయించారు. దీంతో మార్కెట్ యార్డుకు రూ.83.20లక్షల ఆదాయం స మకూరింది. వ్యాపారులకు స్థలం రిజిస్ట్రేషన్ చేసే స మయంలో మార్కెట్ అధికారులు నాలుగు షరతు లు విధించారు. ఆ నిబంధనల ప్రకారం ఖాళీ స్థలం ఆనుకుని ఉన్న మార్కెట్ యార్డుకు చెందిన రక్షణ గో డ, ఇతర ఏ నిర్మాణానికి ఆటంకం కలిగించరాదని పేర్కొన్నారు. మార్కెట్ వ్యాపారాలు నిబంధనలను తుంగలో తొక్కి వ్యాపారులు తమ వ్యాపారాలను రోడ్డు మీదకు విస్తరించుకోవాలనే అత్యాశతో మార్కె ట్ యార్డుకు ఉన్న రక్షణ గోడను కూల్చి వేశారు.
ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న మార్కెట్ ప్రహరీ, ఏదైనా ప్రభుత్వ స్థలం కూల్చివేయాలంటే తప్పని సరిగా కమిటీ తీర్మాణం, అందుకు సంబంధించిన వివరాలను మినిట్స్ బుక్లో తప్పనిసరిగా నిబంధనల ప్రకారం రాయాల్సి ఉంది. అవేవి చేయకుండా వ్యాపారులు ఒత్తిడి చేయడంతో కమిటీ సమావేశమై తెల్లకాగితంపై తీర్మానం చేశారు. తెల్లకాగితంపై టైప్ చేసి ప్రహరీ కూల్చివేతకు అనుమతి ఇస్తున్నట్లు తీ ర్మానం చేశారు. ఇందుకోసం మార్కెట్ యార్డు రక్షణ గోడ కూల్చి వేసే విషయంలో అధికారులకు వ్యాపారులు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్పడంతో మి నిట్స్ బుక్లో రాయకుండా తెల్లకాగితంపై తీర్మానం రాసి అప్పనంగా మార్కెట్ వ్యాపారులకు స్థలాన్ని క ట్టబెట్టే ప్రయత్నం మార్కెట్ అధికారులు చేసినట్లు తెలిసింది. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యా పారులకు లబ్ధి చేకూర్చడానికి పాలక వర్గం చేసిన తీ ర్మానాన్ని ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నా రు. ఇందుకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని మార్కెట్ కార్యదర్శికి ఉత్తర్వులు అందాయి.
గతం లో పనిచేసిన కార్యదర్శి నర్సింహులు బదిలీపై వెళ్ల డం ఆయన స్థానంలో ఇన్చార్జి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కార్యదర్శి ఎల్లస్వామి ఉన్నతాధికారులకు నివేదిక అందించడానికి రికార్డులు పరిశీలిస్తున్న సమయంలో కమిటీ మినిట్స్ పుస్తకంలో ప్రహరీ అంశం లేక పోవడంతో అసలు విషయం బయటపడ్డది. ఈ విషయాన్ని ఆయన ఉన్నతాధికారుల దృష్టి కి తీసుక రావడంతో మార్కెట్ అధికారులు, వ్యాపారులు గుట్టుగా తెల్లకాగితంపై చేసిన తీర్మానం రైట్టెం ది. తెల్లకాగితంపై తీర్మానం చేసి కూల్చీవేతకు అనుమతులు ఇచ్చిన మార్కెట్ అధికారులు, పాలకవర్గం పై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారిపై పోలీస్ కేసులు నమోదు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా కలెక్టర్ చొరవ తీసుకొని మార్కెట్ రక్షణ గోడ కూల్చిన వారీపై చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.