Gadwal -Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 2023 మే 23న హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది. 18 ఏండ్లు నిండిన ప్రతి అమ్మాయికి ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు మహిళలకు ఆర్థిక సహాయం 2500 ఇస్తామని ఆ సభలో ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ ప్రకటించారు. ఆమె తన మాయమాటలతో రాష్ట్రంలో ఉన్న విద్యార్థినుల కుటుంబాలు కోటి ఆశలతో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి 14 నెలలు గడుస్తున్న ఉచిత స్కూటీ లా ఊసెత్తడం లేదు అని గద్వాల జిల్లాలోని డిగ్రీ కాలేజీ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీల హమీను సాధించే వరకు పోస్ట్ కార్డుల ద్వారా నిరసన తెలియజేస్తామన్నారు. పెద్దఎత్తున ఉద్యమించి విద్యార్థినులకు హక్కుగా రావాల్సిన ఉచిత స్కూటీలను కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి సాధించుకుంటామని అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజ్, ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ఎస్వీయమ్ డిగ్రీ కాలేజీ విద్యార్థినులు పాల్గొన్నారు..