జోగుళాంబ గద్వాల జిల్లా ప్రాజెక్టులకు మోక్షం
గట్టు ఎత్తిపోతలకు అడుగులు
ఆర్డీఎస్ మరమ్మతులకు లైన్‌క్లియర్
నెట్టెంపాడ్ ఆయకట్టు రోడ్లకు మంచిరోజులు
శిథిల బ్రిడ్జిల నిర్మాణాలకు మహర్దశ
జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో నీటిపారుదల శాఖ పుష్కలంగా నిధులు విడుదల చేసింది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలోని ప్రాజెక్టులకు, మరమ్మతులకు నిధులు విడుదల చేయకపోవడంతో పెండింగ్‌లోనే ఉన్నాయి. స్వరాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయి. ప్రతి ఎకరాకూ సాగునీరందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు విడుదల చేశారు. ఇందులో భాగంగా ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీమేరకు గట్టు ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేశారు. దీంతోపాటు జూరాల ప్రాజెక్టు మరమ్మతులకు, ఆర్డీఎస్ ఆధునీకరణకు అడుగులు పడనున్నాయి.
గద్వాల, ఏప్రిల్ 11 : జిల్లాలోని ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల తో నీటిపారుదల శాఖ పుష్కలంగా నిధు లు విడుదల చేయడంతో జిల్లా ప్రాజెక్టులకు నిధుల ప్రవాహం కొనసాగుతుం ది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో రాష్ట్రం ఏర్పాటు అయ్యాక తెలంగాణ ప్రభు త్వం విడుతల వారీగా ఒక్కో రంగాన్ని అభివృద్ధి చేస్తూ వస్త్తోంది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలోని పలు ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయకపోవడంతో కొన్ని పనులు పెండింగ్‌లో పడిపోగా మరికొన్ని ప్రాజెక్టులు అభివృద్ధి పనులకు నోచుకోలేదు. జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ జిల్లా ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టి నిధులు విడుదల చేశారు. ఆ నిధులతో జిల్లాలోని ప్రాజెక్టులకు పూర్వవైభం రానుంది.
గట్టు ఎత్తిపోతలకు రూ.328 కోట్లు..
గట్టు ఎత్తిపోతల పథకం రూ.581 కోట్ల తో చేపడుతుండగా మొదటి దశ పనులు చేపట్టడం కోసం రూ.328కోట్లతో టెండ ర్లు పూర్తి చేసి కమిషనర్ ఆఫ్ టెండర్‌కు పంపారు. దీనికి అనుమతి రాగానే అగ్రిమెంట్ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం 935ఎకరాలు భూమి సేకరించారు. ఈ పథకం ద్వారా గట్టు, కేటీదొడ్డి ధరూర్ మండలాల్లో 33వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇందులో చెరువుల ద్వారా 3వేల ఎకరాలకు నీరు అందనుంది. 1.3 టీఎంసీ నీటి నిలువ సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు.
నెట్టెంపాడ్ పనులకు మోక్షం..
నెట్టెంపాడ్ ప్రాజెక్టు పరిధిలో మొదటి దశలో మిగిలిపోయిన 99,100 పను లు చేపట్టడంతోపాటు ప్రాజెక్టు పరిధిలో ని ఆయకట్టు రోడ్లను రూ.21 కోట్లతో అ భివృద్ధి చేయనున్నారు. విఠాలపురం-కుర్తిరావులచెరువు, నాగర్‌దొడ్డి-కుర్తిరావుల చెరువు వరకు రూ.9 కోట్లతో, త ప్పెట్లమెర్సు-అరగిద్ద, తాటికుంట-మద్దెలబండ రోడ్లకు రూ.7.89కోట్లు, గొర్లఖాన్‌దొడ్డి-మిట్టదొడ్డి వరకు రూ.4.11 కోట్లతో రోడ్డు పనులు చేపట్టనున్నారు. వీటికి సంబంధించి టెండర్పక్రియ మొదలైనట్లు అధికారులు తెలిపారు.
జూరాల ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు ..
జూరాల ప్రాజెక్టు అభివృద్ధితోపాటు ప్రా జెక్టు పరిధిలో శిథిలమైనా బ్రిడ్జిల నిర్మాణాల కోసం ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. గేట్ల మరమ్మతుల కోసం రూ.11కోట్లు, గేట్ల క్లీనింగ్‌కు రూ. 21లక్షలు, ప్రాజెక్టుపై లైటింగ్ కోసం రూ.18లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతోపాటు ప్రధాన కుడి కా లువ 0 కిలోమీటర్ నుంచి 29 కిలోమీటర్ వరకు పూడిక తీత మరమ్మతులకు రూ.1కోటి, ధరూర్ మండలం భీంపు రం దగ్గర కూలిన బ్రిడ్జి దగ్గర నూతన బ్రిడ్జి నిర్మాణానికి రూ.48.8లక్షలు, గద్వాల నుంచి నదీఅగ్రహారం వెళ్లే దారి లో నూతన బ్రిడ్జికి రూ.1.37కోట్లు, హ మాలీ కాలనీ దగ్గర బ్రిడ్జి నిర్మాణాన్ని రూ.1కోటితో నిర్మిస్తున్నారు. మన్నాపురం-చింతరేవుల రోడ్డు మరమ్మతుల కో సం రూ.48లక్షలు ఖర్చు చేయనున్నా రు. ర్యాలంపాడ్ రిజర్వాయర్ లికేజీ మ రమ్మత్తులను సర్వే చేయడానికి ప్రభు త్వం రూ.95లక్షలు విడుదల చేసింది.
ఆర్డీఎస్ కాలువకు మరమ్మతులు..
ఆర్డీస్ కాలువ మరమ్మతుల కోసం ప్ర భుత్వం రూ.13.5 కోట్లు మంజూరు చే యడంతో కాలువ మరమ్మతులకు మో క్షం లభించింది. వీటికి త్వరలో టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభించనున్నా రు. తుమ్మిళ్ల లిఫ్ట్ఇరిగేషన్ పరిధిలో 68. 4 కిలోమీటర్ నుంచి అలంపూర్ చివరి ఆయకట్టు 142.8కిలోమీటర్ వరకు ప నులు జరగనున్నాయి. డీ-29,30, 38, 38ఏ,39,40 డిస్ట్రిబ్యూటర్లకు మరమ్మతులు నిర్వహించనున్నారు.
పనులు వేగంగా చేపడుతాం..
జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల మరమ్మతు లు, గట్టు ఎత్తిపోతల పథక నిర్మాణానికి ప్ర భుత్వం నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో పెండింగ్ పనులతోపాటు ప్రాజెక్టు పనులు, కాలువల మ రమ్మతులు, బ్రిడ్జిల నిర్మాణాలు చేపడుతున్నాం. – ఈఈ రహీమొద్దీన్