అయిజ, నవంబర్ 15 : తుంగభద్ర నది తీరంలో ఏర్పాటు చే స్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయిస్తామని అలంపూర్ మాజీ ఎ మ్మెల్యే సంపత్‌కుమార్‌తో ప్రకటింపజేయించాలని బీఆర్ఎస్వీ జి ల్లా నాయకుడు కుర్వ పల్లయ్య కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేశారు. శుక్రవారం అయిజలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్లయ్య మాట్లాడారు. అ లంపూర్ నియోజకవర్గ ప్రజలను నట్టేట ముంచే ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయించి నియోజకవర్గ ప్రజల పక్షాన ఉంటాడా, కార్పొరేట్ శక్తుల పక్షాన నిలబడతారో తేల్చుకోవాలన్నారు.
ఎమ్మెల్యే వి జయుడు రైతులతో కలిసి ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా ధర్నా చేసి స్పష్టంగా ప్రకటించారన్నారు. ఎమ్మెల్యే విజయు డు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి సైతం ఫ్యా క్స్ ద్వారా ఉత్తరం పంపారన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేస్తామని ప్రకటించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై అవాకులు, చవాకులు మాట్లాడే ముందు మీ స్థాయి ఏమిటో తెలుసుకుని మాట్లాడాలన్నారు.
దామగుండం రాడార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసినా కేసీఆర్ హ యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 2,900 ఎకరాల భూమిని అప్పగించేందుకు ఒప్పుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి విహారయాత్రలు చేస్తూ ఢిల్లీకి మూటలు మోస్తున్న సీఎం రే వంత్‌రెడ్డికి పరిపాలనపై సోయిలేదన్నారు. పాలన చేయడం చేతగాక బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలను అరెస్టు చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు. లగచర్లలో ఫార్మా కంపెనీ బాధితులను పోలీసులతో నిర్భందించి ఉగ్రవాదులను అరెస్టు చేసిన విధంగా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లకు తరలించడం విడ్డూరంగా ఉం దన్నారు. కేసీఆర్ హయంలో ఫ్యాక్టరీలు పెట్టే సమయంలో రైతులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు గుర్తుచేశారు. స మావేశంలో బీఆర్ఎస్వీ నాయకులు మత్తాలి, మైబు, అనిల్ గౌడ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.