తిమ్మాజిపేట : తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామంలో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ ( BRS ) నాయకుడు పోచయ్య కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhan Reddy ) శనివారం పరామర్శించారు. గ్రామంలోని బాధిత ఇంటికి వెళ్లి, మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మృతికి కారణాలు తెలుసుకొని, ఓదార్చారు. బాధిత కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్, మాజీ ఎంపీపీ రవినాథ్ రెడ్డి, అయూబ్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి, శివ తదితరులున్నారు.