నాగర్‌కర్నూల్, జూలై 20 : యజ్ఞ, యాగాలు చేయడం వల్ల సకల జీవకోటి సుభిక్షంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ పట్టణంలో శ్రీ కృష్ణ పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానందస్వామీజీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మహోయాగ మహోత్సవంలో మర్రి దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామీజీ దివ్య మంగళ శాసనాలతో నిర్వహిస్తున్న ఆయుత చండీఅతిరుద్రయాగం, సుదర్శ న చండీహోమంలో పాల్గొన్నారు. అంతకుముందు మర్రి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వ రూపానందస్వామీజీ ఆశీస్సు లు పొందారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.