పెంట్లవెల్లి, డిసెంబర్ 15 : ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను గాలికొదిలేసిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి విమర్శించారు. కొల్లాపూర్ మండలంలోని రామాపురంలో ఆదివారం బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మా ట్లాడుతూ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడిచినా ఇప్పటివరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మం డిపడ్డారు.
మార్పు, మార్పు అంటూ రేవంత్‌రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ర్టా న్ని నాశనం చేస్తుందన్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి రైతులను రాజును చేస్తే.. నేడు కాం గ్రెస్ సర్కార్ సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి రైతులకు బేడీలు వేసి కేడీలను చేసి జైలుకు పంపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కొందరు రైతులు పెంట్లవెల్లి సొసైటీలో పంట రుణాలు తీసుకున్నామని తమకు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని మాజీ ఎమ్మెల్యే బీరం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 వరకు రూ. 2లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నేటి వరకు 50శాతం మా త్రమే రుణమాఫీ చేసి చేతులు దులపుకుందని, పైగా రైతు సంబురాలు చేసుకోవడం విడ్డూరమన్నారు. పెంట్లవెల్లి సొసైటీలో 499 మంది రైతులు పంటరుణాలు తీసుకోగా ఇందులో ఒక్క రైతు కూ కూడా నయా పైసా మాఫీ వర్తించలేదని ఆయన మండిపడ్డారు.
కొ ల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు పెంట్లవెల్లి సొసైటీ రైతుల గోడును పట్టించుకోకపోవడానికి గల కారణం ఏమిటని ప్ర శ్నించారు. కొద్ది రోజుల కిందట ఓ మీడియా చానల్ రాష్ట్రవ్యాప్తంగా ప్ర భుత్వ పాలనపై సర్వే నిర్వహించగా 32శాతం పరవాలేదని, 62 శాతం చెత్తగా ఉందని రిపోర్ట్ వచ్చిందన్నా రు. ఇంత తక్కువ సమయంలో ప్రజ ల్లో వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం రే వంత్‌రెడ్డి సర్కారే అని మాజీ ఎమ్మె ల్యే ఎద్దేవా చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రాజేశ్, నరేందర్‌రెడ్డి, కట్టా శ్రీనివాసులు, కా టం జమ్ములయ్య బీఆర్ఎస్ గ్రామ నాయకులు నిరంజన్, గోపాల్ యాదవ్, శరమంద, దర్గయ్య, రాముడు, వం శీ, శేఖర్‌రెడ్డి, బాలయ్య, రాంచందర్, నరేశ్, మల్లేశ్, నాగరాజు, వెంకటస్వామి ఉన్నారు.