ప్రజాతీర్పును శిరసావహిస్తాం..
ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తామని మా జీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి స్ప ష్టం చేశారు. పట్టణంలో తన నివాసం లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రంగినేని అభిలాశ్రావుతో కలిసి ఆయన మాట్లాడారు. తనకు ఐ దేండ్లుగా ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన నియోజకవర్గం ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
- బీఆర్ఎస్ కార్యకర్తలపై భౌతిక దాడులను సహించం
- మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
కొల్లాపూర్, డిసెంబర్ 14: ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తామని మా జీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి స్ప ష్టం చేశారు. పట్టణంలో తన నివాసం లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రంగినేని అభిలాశ్రావుతో కలిసి ఆయన మాట్లాడారు. తనకు ఐ దేండ్లుగా ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన నియోజకవర్గం ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా తాను ప్రజల వైపే ఉంటామని మాజీ ఎమ్మెల్యే బీరం స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చి నా అండగా ఉంటానని, ఎవరూ అధైర్యపడొద్దని పార్టీ శ్రేణులు, ప్రజలకు భరోసా ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం సోమశిల-సిద్ధేశ్వరం వంతెన, 167-కే జాతీయ రహదారి, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ, వాగులపై వంతెనల నిర్మాణం పూర్తిచేయించి ప్రజలకు వినియోగంలోకి తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. మంత్రి వర్గంలో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా స్థానం లభించినందుకు జూపల్లికృష్ణారావుకు ఆయన అ భినందనలు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా పర్యాటక రంగంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని బీరం డిమాండ్ చేశారు. గె లిచినా, ఓడినా ఉప్పొంగేదేలేదని, ప్రజ ల మధ్య ఉంటూ పోరాటాలు చేయ డం తమకు కొత్తేమికాదని స్పష్టం చేశా రు.
గతంలో తాను గెలిచినప్పుడు నియోజకవర్గంలో ఎక్కడా కూడా దాడు లు జరగడం కానీ, శాంతిభధ్రతలకు విఘాతం కలుగలేదని బీరం స్పష్టం చే శారు. కానీ మొన్న కాంగ్రెస్ గెలిచిన త డువే తమ పార్టీ కార్యకర్తలు,నాయకు ల ఇండ్లపై రాళ్లు రువ్వడం, భౌతికదాడులకు పాల్పడిన ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తమైతే సహించబోమ ని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని గెలుపోటములు స్వీకరించే తత్వం ఉండాలన్నా రు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోతే వాటి అమలు కోసం పోరాడుతామన్నారు. కొల్లాపూర్ సమగ్రాభివృ ద్ధి కోసం, అలాగే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయాలని మాజీ ఎ మ్మెల్యే బీరం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరా రు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీలు సింగారం వెంకటయ్యయాదవ్, కట్టారాజేందర్గౌడ్, మార్కెట్ కమిటీ మా జీ డైరెక్టర్ గుజ్జుల పరమేశ్, ఎంపీటీసీలు బుచ్చయ్య, శంకర్‌నాయక్, కౌన్సిలర్లు పస్పుల కృష్ణ, కృష్ణమూర్తి, ఎల్ఐ సీ పాషా, బీఆర్ఎస్ మండలాల అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, రామచందర్‌యాదవ్, యాదన్నగౌడ్, సురేందర్‌రావు, ధర్మయ్య, సాయిరాంయాద వ్, వేణుగోపాల్‌యాదవ్, జక్కుల న ర్సింహ, సర్పంచులు దశరథంనాయ క్, శ్రీనివాస్‌రెడ్డి, హరికృష్ణ ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

