పాన్‌గల్, అక్టోబర్ 6 : కేసీఆర్ సర్కారు హయాంలో మంజూరై శంకుస్థాపన చేయబడిన రామన్నగట్టు రిజర్వాయర్‌ను సకాలంలో పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని కిష్టాపూర్ నుంచి రామన్నగట్టు రిజర్వాయర్ శిలాఫలకం వరకు కార్యకర్తలతో కలిసి ఆదివారం బైక్‌ర్యాలీ నిర్వహించారు. రిజర్వాయర్‌కు జీవో లేదని ప్రచారం చేసిన అధికార పార్టీ నాయకులకు చెంపపెట్టుగా జీవో కాపీని బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా బీరం మాట్లాడుతూ కేసీఆర్ రైతు పక్షపాతిగా ఉండడంతోనే రామన్నగట్టుతోపాటు నియోజకవర్గంలో అనేక రిజర్వాయర్లు, మినీ లిఫ్ట్‌లకు నిధులు మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేశారన్నారు.
0.3 టీఎంసీల సామర్థ్యం ఉన్న రామన్నగట్టును పూర్తి చేస్తే మండలం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవ తీసుకొని టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. సాగునీరు అందేదాక వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన రుణమాఫీ, రైతుభరోసా వంటి పథకాల్లో ఏ ఒక్కటీ అమలు కావడం లేదన్నారు. ఆరు హామీలపై నిలదీస్తారనే భయంతో ‘హైడ్రా’మాకు తెరలేపిందన్నారు.
గత ప్రభుత్వంలో రూ.1.74 కోట్లతో మంజూరైన గోప్లాపూర్ స్టేజీ-రేమద్దుల బీటీ, సీసీరోడ్డు పనులు చేపట్టాల్సి ఉందన్నారు. కానీ కిష్టాపూర్, కిష్టాపూర్ తండా, రేమద్దులలో సీసీరోడ్డు మినహా ఇంతవరకు మిగతా బీటీరోడ్డు పూర్తి చేయకపోవడంతో.. బిల్లులు డ్రా చేసుకొని పనులు చేయకుండా తిరుగుతున్న గుత్తేదారు జగ్గారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి కాల్వలకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, నాయకులు శేఖర్‌నాయక్, వెంకటయ్య నాయుడు, వీరసాగర్, రాజేశ్వర్‌రెడ్డి, చం ద్రూనాయక్, సుధాకర్‌యాదవ్, శేఖర్, కరుణాకర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, శివారెడ్డి, తిరుపతయ్య, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.