మహబూబ్‌నగర్ అర్బన్, మార్చి 16 : మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాటు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి బైక్ ర్యాలీ, కేక్‌కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతకుముందు పిస్తాహౌస్ నుంచి పార్టీ కార్యాలయం వరకు బైక్‌ర్యాలీతో మాజీ మంత్రికి ఘన స్వాగతం పలికారు.
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి శ్రీనివాస్‌గౌడ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు,అభిమానులు ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ స్టేటస్‌లలో శుభాకాంక్షలు తెలిపారు. మయూరి ఎకో పార్క్, గౌడ సంఘం, పిస్తాహౌస్, ఎదిరలో బీఆర్ఎస్ నాయకులు కేక్‌కట్ చేశారు. ఆదివారం ఉదయం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు అందుకున్నారు. కార్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, పట్టణ అధ్యక్షుడు శివరాజ్, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీసీటీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.