మల్దకల్, నవంబర్ 4 : మండలంలోని బిజ్వారంలో ఆత్మహత్యకు పాల్పడిన మైనర్ బాలిక మృతికి కారకులను ఉరి తీయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. గులాబీ బాస్ కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాజేశ్వరి కుటుంబ సభ్యులను సోమవారం వారు పరామర్శించారు. అంతకుముందు మృతురాలి ఇంటి వరకు వారు ర్యాలీగా వచ్చి మృతురాలి తల్లి కవిత, పెద్దమ్మ వెంకటేశ్వరితో జరిగిన ఘటనపై విచారించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ బాలిక మృతిచెంది 20 రోజులు గడిచినా నిందితు డు రాజశేఖర్‌రెడ్డిని పట్టుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో 1.50 లక్షల మంది పోలీసులు ఉన్నా.. నిందితుడిని అరెస్టు చే యడం లేదన్నారు. ఘటనతో రాజశేఖర్‌రెడ్డికి ఎంత సం బంధం ఉందో.. ఎస్సైకి కూడా అంతే ఉందన్నారు. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇంకా పట్టుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
10 బృందాలు వెళ్లాయని అంటున్నారే.. తప్పా ఆచరణలో ఎలాంటి మార్పు లేదన్నారు. రెండు తులాల బంగారం చోరీ ఒకచోట జరిగి తే.. విచారణ మల్దకల్ పోలీస్‌స్టేషన్‌లో చేయడం ఏమిటని ప్రశ్నించారు. బాలికను పనిలో పెట్టుకోవడమే నేరమని.. అలాంటిది ఆమెపై నింద మోపడం ఏమిటన్నారు. బంగారం దొరికిందని యజమాని ఒప్పకొని.. మళ్లీ చోరీ కేసు పెట్టి వేధించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మల్దకల్ ఎస్సై ఇందులో అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. బీఆర్ఎస్తోపాటు అన్ని పార్టీల నాయకులు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 15 రోజులుగా ఆందోళనలు చేయడంతోనే నిందితుడిపై 107 సెక్షన్ కేసు నమోదు చేశారన్నారు.
నియోజకవర్గంలో ఇంత దారుణ ఘటన జరిగినా ఎ మ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పట్టించుకోకపోవడం చూస్తే బంధుప్రీతి చూపిస్తున్నారని అర్థమవుతుందని శ్రీనివాస్‌గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి అన్యాయం జరిగితేనే పట్టించుకోవలేదంటే.. మనం ఓట్లు వేయలే దా? అని ప్రశ్నించారు. రాశేఖర్రెడ్డి వారి బంధువర్గం కావడంతోనే ఈ ఘటనను పట్టించుకోవడం లేదన్నారు. ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కా కుండా డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నా రు.
అప్పటికీ న్యాయం జరగకపోతే ఇంకా ముందుకెళ్ల్లి పోరాటం చేస్తామని హెచ్చరించారు. నిందితుడిని ఉరి తీసేవరకు పోరాడుతాం.. మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో సాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, నాయకులు బైకాని శ్రీనివాసయాదవ్, అభిలాశ్‌రావు, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, కుర్వ విజయ్‌కుమార్, కుర్వ పల్ల య్య, ఇంతియాజ్, నడ్డిగడ్డ హక్కుల పోరాట స మితి అధ్యక్షుడు రంజిత్‌కుమార్, తిరుమల్ నా యుడు, కామేశ్, గంగాధర్, రాజు పాల్గొన్నారు.