వనపర్తి టౌన్, అక్టోబర్ 5 : ఆస్ట్రేలియాలో తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ అని అన్నారు.
తెలంగాణను చిన్నబుచ్చి, అస్తిత్వాన్ని కించపరచడం, వనరుల ను ఇతర ప్రాంతాలకు తరలించడం వల్లే స్వరాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నామని గుర్తుచేశారు. మన సంస్కృతిని, బతుకమ్మ పండుగను విదేశాల్లో సైతం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉత్సవాలు నిర్వహిస్తున్న తెలంగాణవాదులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ప్రజలకు కూడా విషెస్ చెప్పారు. కార్యక్రమంలో నాయకులు అరుణ్‌ప్రకాశ్, ప్రమోద్‌రెడ్డి ఉన్నారు.