వనపర్తి, జూన్ 21 : తెలంగాణ పోరాట స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని.. పదేండ్ల బీఆర్ఎస్ ప్రగతి పాలనలో ఆయన స్ఫూర్తి ఇమిడి ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అ న్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాల యం సమీపంలోని రాక్ఉడ్ పార్కులోని జయశంకర్ విగ్రహానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్, పట్టణ అ ధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌తో కలిసి ఆయన పూలమాల వే సి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ మం త్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ప్ర జా సంక్షేమం, అభివృద్ధిని సాధిస్తామని నమ్మి రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన మహనీయుడు జయశంకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయ న చేసిన త్యాగాలు, స్ఫూర్తిని ప్రజలు ఎన్నటికీ మ ర్చిపోరన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిల ర్లు నాగన్నయాదవ్, కంచె రవి, బీఆర్ఎస్ నాయకులు అశోక్, మాణిక్యం, రఘువర్ధన్‌రెడ్డి, ఉంగ్లమ్ తిరుమల్, రహీం, గోవర్ధన్‌చారి, వెంకటేశ్వరాచారి, మహేశ్వర్‌రెడ్డి, జోహెబ్, రాము, శ్రీను, సురేశ్, మో హనాచారి, రమేశ్, చాణక్య, కృష్ణ పాల్గొన్నారు.