గోపాల్పేట, అక్టోబర్ 7 : ప్రజలంతా ఐకమత్యంతో ముందుకుసాగాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని లక్ష్మీదేవిపల్లిలోని వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద సోమవారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామానికి వచ్చిన నిరంజన్‌రెడ్డికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో లక్ష్మీదేవిపల్లిని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాలరాజు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతియాదవ్, మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, మీడియా కన్వీనర్ అశోక్, నాయకులు మతీన్, చంద్రశేఖర్, బంగారయ్య, శ్రీశైలం, యాదగిరి, లక్ష్మీనారాయణ, శంకర్, మణ్యం నాయక్, మల్లేశ్, లక్ష్మారెడ్డి, మనేశ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.