జడ్చర్ల : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి (Laxmareddy) సోమవారం జడ్చర్లలో జాతీయ పతాకం తో పాటు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు పట్టణంలోని సిగ్నల్ గడ్డలో గల శ్రీకాంతాచారి విగ్రహానికి పూల వాహనాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో ..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh reddy) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, శ్రీకాంతాచారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.