జడ్చర్లటౌన్, మే1 : కార్మికుల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ పనిచేస్తోందని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అ న్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్టీయూ ఆధ్వర్యంలో గురువారం జడ్చర్లలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మేడే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొని బీఆర్టీయూ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అన్ని వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ కృషి చేశారన్నారు.
బీఆర్ఎస్ పాలనలో కార్మిక సంక్షేమ పథకాలను తెచ్చి కార్మికుల జీవితాల్లో వెలుగునింపారన్నారు. ఉద్యోగులు, కార్మికుల జీతభత్యాలను పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆ రోపించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కార్మికులందరూ సంఘటితమై పోరాటం చేయాలని, కార్మికులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందన్నారు. అదే విధంగా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక జెండాను ఆవిష్కరించారు.
ఆ తర్వాత నేతాజీచౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్టీయూ, బీఆర్ఎస్ నాయకులు జెడ్పీమాజీ వైస్ చైర్మన్ యాదయ్య, మురళి, రఘుపతిరెడ్డి, చాంద్‌ఖాన్, శ్రీనివాస్‌యాదవ్, ప్రణీల్‌చందర్, రామ్మోహన్, శ్రీకాంత్, కృష్ణారెడ్డి, కొండల్, ఇంతియాజ్, సతీశ్‌తోపాటు వివిధ సం ఘాల నాయకులు పాల్గొన్నారు.