జడ్చర్ల టౌన్, మే 9 : బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి లక్ష్మారె డ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా గురువారం జడ్చర్లలోని కావేరమ్మపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అ న్ని వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నా రు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి ఓ హోటల్లో స్వ యంగా సమోసాలు వేస్తూ ఓట్లు అభ్యర్థించారు. స ర్కారిచ్చిన హామీలు అమలవుతున్నాయా? అని ప్ర జలను అడిగారు.
అచరణలో అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని.. కాంగ్రెస్, బీజేపీలతో పేదలకు ఎలాంటి మేలు జరుగలేదన్నారు. ఆ రెండు పార్టీల నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని.. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ఎంపీ అభ్య ర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. వ్యాపారస్తులను సైతం కలిసి ఓటు అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.