తిమ్మాజిపేట, సెప్టెంబర్ 10 : అనారోగ్యంతో మృతి చెందిన మాజీ మంత్రి చర్నకోల లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతాలక్ష్మారెడ్డి అంత్యక్రియలు మంగళవారం మండలంలోని ఆవంచలో నిర్వహించారు. మంగళవారం ఉ దయం 11 గంటల సమయంలో శ్వేతాలక్ష్మారెడ్డి భౌతికకాయాన్ని లక్ష్మారెడ్డి స్వగ్రామమైన ఆవంచకు తీసుకొ చ్చారు. లక్ష్మారెడ్డి స్థానికులను చూసి బోరున విలపించారు.
వేలాది మంది అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమె మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఆమె భౌతికకాయాన్ని వైకుంఠ రథంలో కొద్దిదూరం ఊరేగించారు. అనంతరం పాడెలో ఆమె భౌతికకాయాన్ని తరలించగా సతీమణి చితికి లక్ష్మారెడ్డి నిప్పుపెట్టారు. స్థానికులతోపాటు వేలాది మంది అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి ఆశ్రునయనాల మధ్య శ్వేతాలక్ష్మారెడ్డికి వీడ్కోలు పలికారు.
లక్ష్మారెడ్డిని ఓదార్చిన ప్రముఖులు..
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతాలక్ష్మారెడ్డి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించి లక్ష్మారెడ్డిని పరామర్శించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి.. శ్వేతాలక్ష్మారెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మారెడ్డిని హత్తుకొని ధై ర్యం చెప్పారు.
అదేవిధంగా మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, మాజీ స్పీ కర్ మధుసూదనాచారి, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజేశ్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వాకిటి శ్రీహరి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్, ఎర్ర శేఖర్, అంజయ్యయాదవ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎస్ రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ధర్మారెడ్డి, మాజీ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ రా ష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమా ర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇంతియాజ్ ఇసాక్, రజినీసాయిచంద్, నాగం శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి సతీమ ణి మర్రి జమున, నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్‌గౌడ్, మహబూబ్‌నగర్ జెడ్పీ మాజీ చైర్మన్ కోడ్గల్‌యాదయ్య, నాయకులు పరామర్శించారు.