జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 20 : జడ్చర్ల మం డలం పోలేపల్లి సెజ్‌లోని ఎన్ఎంఐఎంఎస్(నిమ్స్) యూనివర్సిటీలో ఫుడ్‌పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన గురువారం వెలుగుచూసింది. ఫుడ్‌పాయిజన్‌తో వి ద్యార్థులు అస్వస్థతకు గురైతే సత్వరమే విద్యార్థులను దవాఖానకు చేర్పించాల్సిన యూనివర్సి టీ యాజమాన్యం యూనివర్సిటీలోనే ఓ డాక్టర్‌తో వైద్యచికిత్సలు అందిస్తూ విషయం బయటకు రాకుండా రహస్యంగా ఉంచారు. ఈ విష యం తెలుసుకున్న మీడియాను యూనివర్సిటీలోకి వెళ్లకుండా సెక్యురిటీగార్డుల చేత అడ్డుకున్నారు.
చివరకు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అక్కడికి చేరుకొని యూనివర్సిటీలో 27మంది విద్యార్థులు చికిత్స పొందుతున్న విషయాన్ని గుర్తించి యూ నివర్సిటీ యాజమాన్యంపై ఆగ్రహం వ్య క్తం చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం దవాఖానకు తరలించాల్సింది.. ఇక్కడే ఎందుకు వైద్యం చేస్తున్నారం టూ మండిపడ్డారు.
వెంటనే విద్యార్థులందరినీ దవాఖానకు తరలించాలని లేదంటే కఠినంగా వ్యవహారించాల్సి వస్తోందని హెచ్చరించడంతో యూనివర్సిటీ యాజమాన్యం స్పందించి అం బులెన్స్‌లను రప్పించి ప్రైవేట్ దవాఖానలకు తరలించారు. అక్కడున్న మీడియా ఫొటోలు తీ సేందుకు యత్నించగా యూనివర్సిటీ సిబ్బం ది అ డ్డుకున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్య, విద్యాశాఖాధికారులు శివకాంత్, జగదీశ్ యూనివర్సిటీ వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. యూనివర్సిటీలోని క్యాంటిన్లో వం టకాల్లో ఫుడ్‌పాయిజన్ కావడంతోనే విద్యార్థు లు అస్వస్థతకు గురైనట్లు ఆరోపణలు ఉండగా, కొందరు విద్యార్థులు యూనివర్సిటీ బయటకు వెళ్లి హోటళ్లలో తినటంతో అస్వస్థతకు గురైనట్లు యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ చెబుతున్నారు