
ధన్వాడ, డిసెంబర్ 6 : రైతులు లాభసాటి పంటలపై దృ ష్టి చేపట్టాలని కలెక్టర్ హరిచందన సూచించారు. మండల రైతు వేదిక భవనంలో మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లో యాసంగి పంటలపై సోమవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి పంటను కొనుగోలు చేయకపోవడం వల్ల కేంద్రాలు ఉండే పరిస్థితి లేదన్నారు. పండ్ల తోటలు, కూరగాయల పంటలు, వా ణిజ్య పంటలు పండించడానికి రైతులు ఆసక్తి కనబర్చాలని కోరారు. వాటిని విక్రయించడానికి మా ర్కెటింగ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు అడవి పందుల నుంచి ఇబ్బంది ఉందని కలెక్టర్‌కు తెలియజేయగా, పంటలను కాపాడుకోవడానికి మార్కెట్లో పరికరాలు లభిస్తాయని, వాటిని ఉపయోగించి రక్షించుకోవాలన్నారు. అదేవిధంగా మండలంలోని రహిమాన్ఖాన్ రైతు పొలా న్ని జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలించి త గు సూచనలు, సలహాలు అందించారు. స మావేశంలో మండల వ్యవసాయాధికారి ప్ర దీప్‌కుమార్, సర్పంచ్ అమరేందర్‌రెడ్డి, తసిల్దార్ బాలచందర్, మార్కెట్ యార్డు డైరెక్టర్ శివారెడ్డి, మండల ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్, ఏఈవో సైమాన్ పాల్గొన్నారు.
ఇతర పంటలు సాగు చేయాలి
యాసంగిలో రైతులు వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేసుకోవాలని కలెక్టర్ హరిచందన అన్నారు. సోమవారం మం డలంలోని సింగారం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ యాసంగిలో వరికి బదులుగా పెసర, మి నుములు, వేరుశనగ, నువ్వులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, కూరగాయలు సాగు చేయాలని సూచించా రు. కార్యక్రమంలో డీఏవో జాన్ సుధాకర్, ఉద్యాన అధికారి వెంకటేశ్వర్లు, ఏఈవోలు, రైతులు తదితరు లు పాల్గొన్నారు.
పంటమార్పిడి విధానం పాటించాలి
రైతులు పంటమార్పడి విధానం పాటించాలని జేడీఏ సుచరిత సూచించారు. సోమవారం మండలంలోని గొల్లపల్లి, బండమీదిపల్లి, మల్లెబోయిన్పల్లి, కోడ్గల్, పోలేపల్లి, నసరుల్లాబాద్, ఆలూర్, గంగాపూర్ గ్రామాల్లో యాసంగి పంటలసాగుపై రైతులకు అవగాహన కల్పించారు. యాసంగిలో వరికి బదులుగా రాగులు, మినుములు, జొన్న, ఆముదం, కూరగాయలు పండించాలని సూచించారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాజమణి, ఏడీఏ అనిల్‌కుమార్, ఏవో గోపినాథ్, ఏఈవోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.