బిజినపల్లి : సెల్ఫోన్లు దొంగతనాలు ( Cellphone Thieves ) చేస్తున్న ఐదుగురిని బిజినపల్లి పోలీసులు అరెస్టు ( Arrest ) చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై శ్రీనివాస్ ( SI Srinivas ) తెలిపిన ప్రకారం.. కొంతకాలంగా పలు ప్రాంతాలలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన సాయి కృష్ణ, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన కిరణ్, ఒడిస్సా రాష్ట్రంలోని జైపూర్ జిల్లా కంత్ర గ్రామానికి చెందిన కిరణ్ దాస్, గంజం జిల్లాలోని సర్ర్దా గ్రామానికి చెందిన దాసు వంశీ , గంజం జిల్లాలోని అస్కనూరు పల్లి గ్రామానికి చెందిన రోహన్‌ను అరెస్టు చేశామని తెలిపారు.
సోమవారం బిజినపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్‌లో సెల్‌ఫోన్‌ను దొంగలిస్తుండగా పట్టుకున్నామని వివరించారు. విచారణలో నిందితుల నుంచి 17 సెల్ఫోన్లు , ఒక కారు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు. వ్యాపార సముదాయాలు, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.