మహబూబ్‌నగర్ టౌన్, జనవరి 12 : క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తిని చాటాలని సౌత్‌జోన్ నెట్‌బాల్ చైర్మన్ గిరీష్ సీ గౌడ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో సౌత్‌జోన్ ఫాస్ట్-5, మహిళ, పురుషుల నెట్‌బాల్ చాం పియన్షిప్ టోర్నీలో విజేతలకు ఆయన ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ర్టాల్లో నెట్‌బాల్‌లో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్నారన్నారు. క్రీడాకారులకు క్రీడా కోటలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. రేపటి నుంచి జరిగే జాతీయస్థాయి టోరీలో ఆయా జట్ల క్రీడాకారులు ప్రతిభ చాటాలని సూచించారు. కార్యక్రమంలో నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆదిత్యరెడ్డి, ఖాజాఖాన్, ఉపాధ్యక్షుడు సాదత్‌ఖాన్, ట్రెజరర్ సోహెల్, రామ్మోహన్, రఘు, అంజద్, షకీల్, అక్రమ్ పాల్గొన్నారు.
సౌత్‌జోన్ ఫాస్ట్-5 మహిళ, పురుషుల నెట్‌బాల్ చాంపియన్‌షిప్ ముగిసింది. పురుషుల(ట్రెడిషనల్) ఫైనల్ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 12-04తో కర్టాటకపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది. మహిళల విభాగంలో కర్ణాటక జట్టు 20-18తో కేరళపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది. కర్ణాటక, కేరళ జట్లు రన్నర్‌గా నిలిచాయి. తెలంగాణ మహిళ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఫాస్ట్-5 పురుషుల ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక జట్టు 20-09తో కేరళపై చాంపియన్ నిలువగా, మహిళా విభాగంలో కేరళ జట్టు 26-22తో కర్టాటకపై గెలిచింది. రన్నర్‌గా పురుషుల విభాగంలో కేరళ, మహి ళా విభాగంలో కర్టాటక నిలిచాయి. పురుషులు, మహిళా విభాగంలో తెలంగాణ, పుదుచ్చేరి జట్టు మూ డోస్థానంలో నిలిచాయి.