ఆత్మకూర్ : రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ( Paddy Centres ) ఏర్పాటు చేస్తుందని ఆత్మకూరు మండలం రేచింతల ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు లక్ష్మీకాంత్ రెడ్డి( Laxmikanth Reddy) , అమరచింత వ్యవసాయ శాఖ అధికారి అరవింద్ పేర్కొన్నారు. రేచింతల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కత్తిపల్లి, తూంపల్లి, వీర రాఘవపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రేచింతల ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు లక్ష్మీకాంత్ రెడ్డి ప్రారంభించారు.
ఆత్మకూరు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ అధికారి, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండించిన పంట అమ్ముకునే సమయంలో దళారుల బెడద నుంచి తప్పించేందుకు, పంటకు గిట్టుబాటు ధర కల్పించి వారి ముఖంలో సంతోషం నింపేందుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు.
డబ్బులు అందజేయడంలో అవకతవకలకు, కమిషన్ల బెడద లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఆత్మకూర్ మండల అధ్యక్షుడు పరమేష్, మాజీ అధ్యక్షుడు రహమతుల్లా, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తులసిరాజ్, పట్టణ అధ్యక్షుడు నల్లగొండ శ్రీనివాసులు, అమరచింత కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎస్ఎం అరుణ్ కుమార్, మాజీ ఎంపీటీసీ అయూబ్ ఖాన్, రైతులు పాల్గొన్నారు.