Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
Srinivas Goud | రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువుకు మొత్తం పంటలు ఎండిపోయి రైతాంగం అల్లాడుతుంటే ప్రభుత్వం కరువు మండలాల ప్రకటనలో కూడా రాజకీయం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
మహబూబ్ నగర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువుకు మొత్తం పంటలు ఎండిపోయి రైతాంగం అల్లాడుతుంటే ప్రభుత్వం కరువు మండలాల ( Drought Mandals ) ప్రకటనలో కూడా రాజకీయం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) మండిపడ్డారు. గురువారం మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలంలోని లింగన్నపల్లి గ్రామంలో ఎండిపోయిన పంటలను పరిశీలించి వేపూరు సబ్‌స్టేషన్ ముందు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా( Protest ) నిర్వహించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కరువు మండలాలుగా ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరువు మండలాల ప్రకటనలో కూడా ఉమ్మడి జిల్లాలో వివక్ష చూపించారని ఏ మండలంలో కూడా పంటలు చేతికి రాలేదని ఆరోపించారు. మొత్తం పంట ఎండిపోయి పండిన పత్తికి కూడా దిగుమతి తక్కువగా వచ్చిందని వెల్లడించారు. కొన్ని మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి మిగతా మండలాలను మినహాయించడం ప్రభుత్వానికి తగదన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలని అన్నారు. యాసంగి పంటకు సంబంధించిన రైతుబంధును ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామన్న హామీని మూడేళ్లకు 36వేల రూపాయలను వెంటనే విడుదల చేసి కూలీలను ఆదుకోవాలని అన్నారు. లేకపోతే బొంబాయి, హైదరాబాద్ ,ఇతర ప్రాంతాలకు వలస పోయే పరిస్థితి ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కృష్ణా నదికి భారీ వరదలు వచ్చినా కాని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 60 టీఎంసీలు నిల్వ చేసేందుకు సరిపడా రిజర్వాయర్లను కేసీఆర్ కడితే కనీసం వాటిని నింపలేదని అవి ఉపయోగంలోకి తీసుకువస్తే కరువు ఉండేది కాదన్నారు. అనంతరం రైతులతో కలిసి వేపూరు 33 కెవి సబ్ స్టేషన్ ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కరుణాకర్ గౌడ్, నరేందర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
Culinary Medicine | ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న క్యులినరీ మెడిసిన్.. అసలేమిటి.. ఏం చేస్తుంది..?
Electric Shock | దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం..భార్యభర్తలు మృతి
Balmuri Vidyasagar Rao | రాజకీయ ఒత్తిళ్ల ద్వారా నా భూమి కబ్జాకు ప్రయత్నం : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పెద్దనాన్న
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

