గద్వాల/అమరచింత, ఆగస్టు 8 : కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా గోస తప్పడం లేదు. వానకాలం సీజన్లో సాగు చేసిన పంటలు పెరుగుతున్న సమయంలో అందించాల్సిన యూరియా అందుబాటులో లేక ఇక్కట్లు పడుతున్నారు. ఓవైపు యూరియా నిల్వలు పు ష్కలంగా ఉన్నాయంటూ ప్రభుత్వం.. అధికారులు ప్రగల్భాలు పలుకుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భి న్నంగా ఉన్నాయి. దీంతో రైతులకు పడిగాపులు తప్పడం లేదు.
యూరియా వచ్చిందని తెలిస్తే చాలు తెల్లవారుజామునే పీఏసీసీఎస్ కేంద్రాలకు చేరుకొని గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి.. అయినా బస్తాలు దొరుకుతాయ న్న నమ్మకం సన్నగిల్లింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో మొన్నటి వరకు వర్షాలు కురవడం లేదని వరుణుడి కరు ణ కోసం రైతులు, ప్రజలు ప్రత్యేక పూజలు చేయగా.. గురువారం రాత్రి జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో సాగు చేసిన పంటకు యూరియా వేయడానికి జిల్లా కేంద్రంలోని పీఏసీసీఎస్ కేంద్రం వద్దకు పరుగులు పెట్టా రు.
ఉదయం నుంచి గంటల తరబడి క్యూలో నిలబడినా కొందరికి మాత్రమే యూరియా అందగా.. మిగితా వారు నిరాశతో వెనుదిరిగారు. ప్రభుత్వం సబ్సిడీపై రూ.266కు యూరియా సరఫరా చేస్తుండగా.. ప్రస్తుతం అందుబాటులో నిల్వలు లేకపోవడంతో ప్రైవేట్ డీలర్లను ఆశ్రయిస్తే వారు రూ.300 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. అయితే కర్ణాటక, ఏపీకి రాత్రివేళల్లో గుట్టుగా యూరియాను తరలిస్తున్నట్లు సమాచారం.
వనపర్తి జిల్లా ఆత్మకూరు పీఏసీసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు బారులుదీరారు. జూరాల డ్యాం ఎడమ, భీమా డీ-6 కాల్వల పరిధిలో అధికంగా వరి సాగైంది. అయితే ఎకరాకు మూడు నుంచి నాలుగు వరకు యూరి యా బస్తాలు అవసరం ఉండగా.. ప్రాథమిక సహకార సంఘం కార్యాలయానికి నిత్యం ఒక లోడ్ యూరియా వస్తుండడంతో రైతుకు రెండు బస్తాలు పంపిణీ చేస్తున్నారు. బయటి మార్కెట్ కన్నా తక్కువ ధరకే ప్రభుత్వం యూరియా బస్తా ఇస్తుండడంతో రైతులు వచ్చి గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. నిత్యం 250 బస్తాల యూరియాను తెప్పించి.. రైతుకు రెండు బస్తాల చొప్పున అందిస్తున్నామని పీఏసీసీఎస్ సీఈవో నరేశ్ తెలిపారు.