హన్వాడ : పశువుల డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో తమ పశువులకు సకాలంలో చికిత్స అందడం లేదని ఆరోపిస్తూ హన్వాడ రైతులు శనివారం వేపూర్ గ్రామంలో పశువుల దవాఖాన ఎదుట నిరసన తెలిపారు. గత మూడు రోజుల నుంచి డాక్టర్ రావడంలేదని రైతులు ఆరోపించారు.
ఎండలు విపరీతంగా పెరిగిపోవడంతో పశువులకు వస్తున్న రోగాలకు చికిత్స చేయించేందుకు దవాఖానకు వస్తే డాక్టర్లు , సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజు డాక్టర్ దవాఖానకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత డాక్టర్ను అడగగా పక్కనున్న గ్రామాల పశువులకు ఇంజక్షన్ ఇవ్వడానికి వెళ్లడంతో కార్యాలయానికి రాలేకపోయానని వెల్లడించారు.