నాగర్‌కర్నూల్/పెంట్లవెల్లి, ఏప్రిల్ 7 : కొల్లాపూర్ నియోజకవర్గంలో రైతుల తిరుగుబాటు మొదలైంది. తీసుకున్న రుణాలు మాఫీ కాకపోవడంతో ఆగ్రహించిన రైతులు కలెక్టరేట్‌ను ఆశ్రయించిన ఘటన సోమవారం జిల్లాలో చోటు చేసుకున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులుగా ఉన్న 499మంది రైతులు 12/12/2018 నుంచి 09/12/2023 మధ్యకాలంలో సంఘం నుంచి రుణాలు తీసుకున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీలో సదరు రైతులకు చెందిన రుణాలు మాఫీ కాలేదు.
దీంతో ఆగ్రహించిన రైతులు గత రెండు నెలలుగా నిరసనలు, ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. ఇందులో భా గంగానే సోమవారం మరోసారి రైతులు నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌కు చేరుకొని ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాము తీసుకున్న రుణాలను వెం టనే మాఫీ చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రకటించిన మూడు విడుతల రుణమాఫీలో రూ.10వేల నుంచి లక్ష వరకు ఏ ఒక్క రి రుణం కూడా మాఫీ కాకపోవడంతో తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
పెంట్లవెల్లి పీఏసీసీఎస్ నుంచి తీసుకున్న 499 మందికి చెందిన రుణాలు మాఫీ కాకపోవడానికి గల కారణాలపై విచారణ జరిపి తమకు రుణం మాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్‌కు ఇచ్చిన వినతిపత్రంలో కోరా రు. అంతకుముందు కలెక్టరేట్ గేటు ముందు ప్లకార్డులతో నిరసన తెలిపారు. నాలుగో విడుతతో కలిపి మొత్తం రుణాన్ని మాఫీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెంట్లవెల్లి పీఏసీసీఎస్కు పరిధిలోని రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
అంతకు ముందు పెంట్లవెల్లి సోసైటీలో రైతులకు రుణమాఫీ వర్తింప చేయాలని కోరుతూ పెంట్లవెల్లి సొసైటీ పరిధిలోని కొండూరు, మల్లేశ్వ రం, మంచాలకట్ట, మాధవస్వామినగర్, ఎంగంపల్లితండా, రామాపురం, సోమశిల గ్రామాలకు చెంది న 150మంది రైతులు సోమవారం పెంట్లవెల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాకు పీఏసీసీఎస్ చైర్మన్ విజయరామారావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోతుల వెంకటేశ్వర్లు తదితరులు మద్దతు తెలిపారు. అనంతరం తాసీల్దార్ జయసింహకు వినతిపత్రం అందజేశారు. కా ర్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన రైతులు అ బ్దుల్హూస్సేన్, నర్సింహ, రాంచందర్, తిరుపాలు, జానేశ్వర్, బాలస్వామి, నాగశేషి, వల్లయ్యలతోపా టు దాదాపు 150మంది రైతులు పాల్గొన్నారు.