గద్వాల, మే 12 : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మాలంటే మార్కెట్లో తమను నిండా ముంచుతున్నారని రైతు లు ఆగ్రహం చెందారు. తరుగు పేరు తో నిలువునా ముంచుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్వీ రాష్ట్ర నేత కుర్వ పల్లయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేత నాగర్‌దొడ్డి వెంకట్రాములు, 20మంది రైతులు బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. కొనుగోలు కేం ద్రాల వద్ద నిర్వాహకులు, అధికార పార్టీ నాయకులు తమను దగా చేస్తున్నారని కన్నెర్ర చేశారు. తరుగు పేరుతో క్వింటాకు రెండున్నర కిలోలు తీస్తూ రైతులను నిలు వు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం బీఆర్ఎస్వీ నేత పల్ల య్య మాట్లాడుతూ జిల్లాలో 69 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏ ర్పాటు చేశారని, ప్రతి సెంటర్లో నిర్వాహకులతో కాంగ్రెస్ నా యకులు కుమ్మక్కై దోపిడీ చేస్తున్నారని ఆ రోపించారు. తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు లు పండించిన ధాన్యం కొనుగోలు చేయడంతోపాటు, ప్రతి రైతుకూ అవసరమైన గన్నీ బ్యాగులు సరఫరా చేయాలని డి మాండ్ చేశారు.
ఈ విషయంపై గతంలో పలుమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలి తం లేదని దుయ్యబట్టారు. వాస్తవంగా కేంద్రాల్లో బస్తాకు 40 కేజీ లు, బస్తా బరు వు మాత్రమే తూకం వేయాలని ఆదేశాలు ఉన్నా.. అవేమీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అలాగే వెంటనే గన్నీ బ్యా గులు ఇచ్చి కల్లాల్లో రైతులు తెచ్చిన ధాన్యా న్ని తూకం వేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక, రాయలసీమ నుంచి ఇక్కడికి కొందరు దళారులు ధాన్యం తెచ్చి అమ్ముకుంటున్నారని, ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరపాలన్నారు. రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వంపై రైతులు తిరగబడే రోజులు తొందర్లోనే వస్తాయని హెచ్చరించా రు. అనంతరం అయిజ మండలంలోని రాజపురం, పులికల్, బైనపల్లి తదితర సెంటర్లలో జరుగుతున్న దోపిడీ గురించి కలెక్టర్ సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నవాజు, మైబు, మ గ్బూలు, ఆంజనేయు లు, ప్రకాశ్, భీమన్న, మో జే శ్, రైతులు శేఖర్, ఆంజనేయులు, దస్తగురి, నాగరాజు, రాఘవ, గోవింద్, తేజ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.