అచ్చంపేటరూరల్, ఏప్రిల్ 8 : ఉమామహేశ్వర ప్రాజెక్టులో చేపడుతున్న రిజర్వాయర్ వల్ల బల్మూరు మండల రైతులకు లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని దాదాపు 2,067ఎకరాల్లో రెండు పంటలు పండించే భూములను కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి రానున్నదని నిర్వాసిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అందుకే తమ ప్రాణాలు పోయినా రిజర్వాయర్ పనులను కొనసాగనివ్వమని మంగళవారం నిర్వాసిత రైతులు భూములను సర్వే చేయడానికి వచ్చిన అధికారులను అడ్డగించిన ఘట న అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం అనంతవరంలో చోటు చేసుకున్నది. అనంతవరం, అంబగిరి, బల్మూరు రైతులు రామకృష్ణ, శేఖర్‌రెడ్డి, స్వామి, తిరుతయ్య తెలిపిన వివరాల ప్ర కారం 2067 ఎకరాల భూములు కోల్పోతుండగా మండలం లో మొత్తం కేవలం 360ఎకరాలకు నీరు పారే అవకాశం ఉందని ప్రాజెక్టు కింద ఎక్కువ మంది స న్న చిన్న కారు ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు అధికంగా ఉన్నారన్నారు.
ప్రాజెక్టును నిలుపుదల చేయాలని కోర్టుకు వెళితే ఫీసా యాక్ట్ ఏసీటీ 2011, రిస్టిలార్ ఆక్ట్ ఏసీటీ 2013 ప్రకారంగా ఇక్కడ భూములు కోల్పోయే ఎస్సీ, ఎస్టీ నిర్వాసిత రైతులకు సరిసమానంగా సేద్యం చేసుకునే భూములను ఇచ్చిన తర్వాతనే రిజర్వాయర్ ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని కోర్టు ఆర్డర్ ఇవ్వగా వా టిని ధిక్కరించి స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రాజెక్టు పనులను ప్రారంభించడానికి భూమి పూజ చేయడం ఎంత వరకు సమంజసమని నిర్వాసిత రైతులు ప్రశ్నించారు.
బల్మూరు మండలం నుంచి ఎమ్మెల్యే సొంత మండలం అ మ్రాబాద్కు నీటిని తరలించుటకు ప్ర యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి రైతుల పొట్టకొట్టి అ క్కడి రైతులకు సాగు నీరు తీసుకవెళ్లడం భావ్యం కా దన్నారు. గతంలో కేఎల్ఐ ప్రా జెక్టు చం ద్రసాగర్ లిఫ్ట్ ద్వారా1.5 కిలో మీటర్లు కాల్వ తవ్వి తే సాగు నీరు తీసుకోవచ్చన్నారు.
నిర్వాసిత రైతుల కు సరైనా పరిహారం అందించకుండా భూమి ని సేకరించే అధికారం ప్రభుత్వాలకు లేదని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టీస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్ ధర్మాసనం 23/11/2023లో తీర్చునిచ్చినట్లు గుర్తుచేశారు. 2021నుంచి ఇప్పటి వరకు ఈ ప్రా జెక్టు నిర్మించవద్దని రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా రుసుల్చెరువు గానీ, బేచిరాగ్ గ్రామమైన రామగిరి ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మించాలని రై తులు సూచించారు.
ఎన్నికలముందు ఎమ్మెల్యే వం శీకృష్ణ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రాజెక్టు ని ర్మా ణం నిలిపివేసి భూ నిర్వాసితులకు న్యాయం చే స్తానని ప్రతిపక్షంలో ఉండగా రైతులకు హామీ ఇచ్చార ని, తీరా మాట మార్చి ప్రాజెక్టు పనులకు పో లీసు పహారాలో భూమిపూజ చేయడం అన్యాయమన్నారు.