నాగర్కర్నూల్, మే 20 : నాగర్కర్నూల్ మా ర్కెట్లో వరి ధాన్యం కొనుగోలు ఆరంభంలోనే హంసపాదుగా మారింది. రైతు పండించిన వరి పంట కోతలు కోసి ఇప్పుడిప్పుడే అ మ్మకానికి సిద్ధమవుతున్నారు. ఈతరుణంలో నాగర్కర్నూల్ మార్కెట్ యార్డులో కనీసం ఆరబెట్టేందుకు సైతం స్థలం లేక రైతులు ఇ బ్బందులు తప్పడం లేదు. ట్రాన్స్పోర్ట్ సమ స్య కారణంగా ఇప్పటికే కొనుగోలు చేసిన మక్కలు తరలించకపోవడంతో మార్కెట్ నిండా మక్కలే ఉన్నాయి. ఈక్రమంలో వరి ధాన్యం తీసుకొచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అకాల వర్షాలకు భయపడి తడి చేనులోనే కోతకోసి తీసుకొచ్చిన రైతు ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు స్థలం లేకుం డా పోయింది.
ఎలాగోలా ధార్యాన్ని మార్కెట్కు తెచ్చినా తాలు, చెత్త పేరుతో కొంతమం ది రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో దొడ్డు వడ్లు మార్కెట్కు తెచ్చిన రైతులు కొనుగోలు చేయకపోవడంతో వాటి వద్దే నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యాన్ని సైతం మిల్లులకు తరలించేందుకు రవాణా కొరత ఏర్పడుతుండడంతో మిగతా రైతుల ధాన్యా న్ని మార్కెట్కు తెచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో రైతులు మార్కెట్లకు అడపాదడపాగా అమ్మకాలను ధాన్యాన్ని తెస్తున్నారు. ప్రభుత్వానికి విక్రయిస్తే మద్దతు ధర వస్తుందన్న ఆశతో మార్కెట్ తెచ్చిన ధాన్యానికి ఎదో ఒక మెలిక పెట్టడంతో కొందరు రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించేందుకు పూనుకుంటున్నారు.
ఇదే అదనుగా భావించిన దళారులు తక్కువ ధరలకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలో ఏర్పాటు చేసిన 200కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు కేవలం 9100 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనాల్సిన లక్ష్యం గా కాగా, ఇంకా 1.89 మెట్రిక్ టన్నులు కొనాల్సి ఉంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించకపోతే మొక్కజొన్న రైతుకు ఏర్పడిన దుస్థితే వరి రైతులకు ఏర్పడుతుందని రైతులు అభిప్రాయ పడుతున్నారు.