అయిజ, జనవరి 17 : ‘రైతులు అధైర్యపడొద్దు.. ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు సాగునీళ్లిస్తాం’.. అని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. యాసంగిలో సాగు చేసిన పంటలకు సాగునీటి సరఫరాకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టులో 37,500 ఎకరాలకు సాగునీరు వి డుదల చేస్తామని, కలెక్టర్ ఐఏబీ సమావేశంలో నిర్ణయించారని, అందుకనుగుణంగా ఇరిగేషన్ అధికారులు నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని ఉప్పల క్యాంప్‌లోని ఆర్డీఎస్ ప్రధాన కార్యాలయంలో ఆర్డీఎస్ డీఈ సచ్చింద్రనాథ్ సేత్, ఏఈలు రాందాస్, గోవర్ధన్‌రెడ్డి, హేమంత్‌రెడ్డి తో నీటి విడుదలకు అనుసరించాల్సిన విధానంపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.
ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సహకారంతో ఆర్డీఎస్ రైతాంగానికి సకాలంలో సాగునీటి విడుదలకు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్, ఏపీ ఈ ఎన్సీ వెంకటేశ్వర్రావుతో ఎప్పటికప్పుడు సంప్రదించి జాయింట్ ఇండెంట్తోనే ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటి విడుదల సాధ్యమవుతుందని వివరించినట్లు తెలిపారు. దీంతో టీబీ డ్యాం నుంచి జాయింట్ ఇండెంట్ విడులైనట్లు చెప్పారు. ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఆయకట్టులో పం టలు ఎండిపోతుండడంతో రైతుల కోరిక మేరకు మంత్రి ఉత్తమ్‌తో పలుమార్లు సమావేశమై చర్చించినట్లు వివరించారు. ఆర్డీఎస్ ఇండెంట్‌ను రెండు విడుతలుగా టీబీ డ్యాం నుంచి విడుదల చేసినప్పటికీ ఆర్డీఎస్ ఆనకట్టకు చే రేలోగా కర్ణాటక రైతులు మోటర్ల ద్వారా తోడేస్తున్న విషయాన్ని ఈఎన్సీ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
ఏపీలోని కర్నూల్ జలమండలి సీఈ కబీర్‌బాషా, ఎస్ఈ బాలచంద్రారెడ్డితో ఎప్పటికప్పుడు సంప్రదించి కేసీ కెనాల్ ఇండెంట్‌ను త్వరగా టీబీ డ్యాం నుంచి విడుదల చేసేందుకు చ ర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఏపీ ఈఎన్సీ నుంచి అనుమతి రాగానే కేసీ కెనాల్ ఇండెంట్లోని 2.50 టీఎంసీలు ఈనెల 14న టీబీ డ్యాం నుంచి విడుదల చేయడం తో ఆర్డీఎస్కు చేరాయన్నారు. ప్రస్తుతం ప్రధాన కాల్వ ద్వారా డీ-25 వరకు నీళ్లు చేరాయని, నేడో.. రేపో తు మ్మిళ్ల ఎత్తిపోతల పథకం ప్రారంభించేందుకు చర్యలు తీ సుకోవాలని ఆర్డీఎస్ అధికారులను ఆదేశించారు. ప్రస్తు తం ప్రధాన కాల్వకు వస్తున్న నీటిని వృథా చేయకుండా చివరి ఆయకట్టు వరకు సాగు చేసిన పంటలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాల్వపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని, కర్ణాటకలోని రైతులు అక్రమంగా నీటిని వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరు చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఆర్డీఎస్ రైతుల సంక్షేమానికి అహర్నిశ లు కృషి చేస్తామన్నారు. సకాలంలో నీటి విడుదలకు కృషి చేసిన వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్డీఎస్ డీ-18 వద్ద ప్రధాన కాల్వలో పారుతున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.