మహబూబ్నగర్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడుతుండడంతో రైతులు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. దుక్కి దున్ని జూన్ మొదటి వారంలో విత్తేందుకు సన్నద్ధమవుతున్నారు. గతేడాది యాసంగి సాగు ఆశించినంతగా లేకపోవడంతో ఈసారి వానకాలంపైనే అన్నదాత లు ఆశలు పెట్టుకున్నారు. నైరుతి రుతుపవనాలు కూడా సకాలంలో వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. వానకాలం సాగు అంచనాలకు మించి ఉండడంతో అందుకు తగ్గట్టుగా విత్తనాలను సరఫరా చేయడంలో అధికారులు చేతులెత్తేశారు.
ఉమ్మడి జిల్లాలోని అన్ని చోట్లా రైతులకు అవసరమైన విత్తనాలు లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వ్యా పారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. వానకాలం విత్తన ప్రణాళిక కాగితాలకే పరిమితమైంది. మరోవైపు నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్లో పోటెత్తుతున్నాయి. కల్తీ విత్తనాలపై అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. దొడ్డిదారిలో వ్యాపారస్తులు రైతులకు అంటగడుతున్నారు. గతేడాది కూడా పెద్ద ఎ త్తున నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు రూ.లక్షల్లో నష్టపోయారు.
ఇప్పటికే రెండుచోట్ల పత్తి వి త్తనాలను పట్టుకున్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులు నకిలీ విత్తనాలపై కొరఢా ఝులిపిస్తున్నా వ్యాపారులు మాత్రం అదే దారిలో నడుస్తున్నారు. వానకాలం సమీపిస్తున్నా ప్రభుత్వం రైతు భరోసాపై ఇప్పటివరకు స్ప ష్టత ఇవ్వకపోవడంతో ఈసారి కూడా రైతాంగం ప్రైవేట్ అప్పుల వైపు మొగ్గుచూపుతున్నది. పెట్టుబడి సాయం కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి దాపురించింది. మరోవైపు ఎరువుల కొరత వెంటాడుతున్నది.
ఉమ్మడి జిల్లాలో 2024 వానకాలానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ఆయా జిల్లాల్లో విత్తన ప్రణాళికను రెడీ చేశారు. దీంట్లో రైతులకు అవసరమైన విత్తనాలతోపాటు ఎరువులు కూడా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మార్కెట్లో మాత్రం రైతులకు సరిపడా విత్తనాలు లభించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నా యి. నారాయణపేట జిల్లాలో అధికారులు 44,396 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వే శారు. ఇప్పటివరకు 35,516 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని, అలాగే పత్తి 2 లక్షల ప్యాకెట్లు సి ద్ధంగా ఉన్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి కొరత లేదని అధికారులు తెలిపారు. వారి అంచనా ప్రకారం 49,739 క్వింటాళ్లు ఉండగా ఇప్పటివరకు 38,450 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని అం టున్నారు. 1,98,520 ప్యాకెట్ల పత్తి విత్తనాలు రెడీగా ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 3,21,523 ఎకరాల్లో వివి ధ రకాల పంటలు సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇందుకు గానూ 47,260. 40 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేశారు. అంతేకాకుండా యూరియా, డీఏపీ కాంప్లెక్స్, ఎస్ఎస్పీ, ఎండీపీలు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ చెబుతున్నది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో వానకాలం సా గుకు అధికారులు ఇప్పటివరకు విత్తనాలను అం దుబాటులో ఉంచకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు ఇప్పటివరకు 650 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు మాత్రమే వచ్చాయి. మిగతా విత్తనాలు రాలేదు. కాగా, అధికారులు మాత్రం వరి 20,887 క్వింటాళ్లు, కంది 710 క్వింటాళ్లు, మొక్కజొన్న 1,128 క్వింటాళ్లు, వేరుశనగ 4,251 క్వింటాళ్లు, ఆముదం 29 క్వింటా ళ్లు, మినుములు 36 క్వింటాళ్లు, మిరప 15 క్విం టాళ్ల విత్తనాలు కావాలని అధికారులు ఇండెంట్ పెట్టా రు. ఈ జిల్లాలో ఒకవైపు కృష్ణానది మరోవైపు తుంగభద్ర ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి జి ల్లా వ్యాప్తంగా అత్యధిక సాగు ఇక్కడే ఉంటుంది. కానీ రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచడంలో అధికారులు విఫలమయ్యా రు. దీంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొన్నది.