ప్రభుత్వమే బాధ్యత వహించాలి
జడ్చర్ల దవాఖాన మార్చురీలో జరిగిన ఘటనపై ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి మృతుడి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జడ్చర్ల తాసీల్దార్ కార్యాలయం ఎదుట మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి అఖిలపక్షం నాయకులు ధర్నా చేపట్టారు.
- జడ్చర్ల మార్చురీ ఘటనలో మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి
- జడ్చర్ల తాసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిలపక్షం ధర్నా
జడ్చర్లటౌన్, మార్చి 6 : జడ్చర్ల దవాఖాన మార్చురీలో జరిగిన ఘటనపై ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి మృతుడి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జడ్చర్ల తాసీల్దార్ కార్యాలయం ఎదుట మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి అఖిలపక్షం నాయకులు ధర్నా చేపట్టారు. ద ళితుడైన భీమేశ్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామంటూ బైఠాయించారు.
ఈ సందర్భంగా పలువురు అఖిలపక్షం నాయకులు మాట్లాడు తూ ప్రభుత్వం బాధ్యత వహించి మృతుడి కుటుంబానికి రూ.30 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అదే విధంగా రెండు ఎకరాల ప్రభుత్వ భూమి, ప్రభుత్వ దవాఖానలో ప్రైవే టు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూం ఇంటితోపాటు మృతుడి కుమారుడిని గురుకుల పాఠశాలలో సీటు క ల్పించాలని కోరారు. అనంతరం డీటీ మాధవికు వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్, బీజే పీ, సీపీఐ, బీసీసేన, ఎమ్మార్పీఎస్, గిరిజన విద్యార్థి సంఘం, బహుజన పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

