అచ్చంపేట, ఫిబ్రవరి 24: పేదరికంతో ఉన్న త మ కుటుంబాలకు ఆసరా గా ఉండి ఆదుకునేందు కు రాష్ట్ర సరిహద్దులు దా టి వచ్చిన జార్ఖండ్ కూలీల కుటుంబాలు తమ పిల్లల ఆచూకీ కోసం ఎ దురుచూస్తున్నారు. రో జూ ఫోన్లో యోగక్షేమా లు మాట్లాడుకునే కుటు ంబ సభ్యులు తమ పిల్ల లు, కుటుంబ సభ్యులు టన్నెల్లో చిక్కుకున్న స మాచారం అందుకున్న కుటుంబాలు పొరుగు రా ష్ర్టాం నుంచి కుటుంబ స భ్యుల జాడకోసం దోమలపెంటకు చేరుకుంటున్నాయి. అమ్రాబాద్ మండలం దోమలపెంటలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో చోటుచేసుకున్న ప్రమాదంలో చిక్కుకున్న 8మంది కార్మికులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులు చివరి చూపుకోసం ఎదురుచూస్తున్నారు.
రెండు కుటు ంబాలు దోమలపెంటకు వచ్చి ఆచూకీ లభించకపోవడంతో తిరిగి వెళ్లినట్లు సమాచారం. అయితే ఎనిమిదిమంది చిక్కుకున్నవారిలో అనూజ్ సాహూ (30) జార్ఖండ్ కార్మికుడు ఒకరు. ఆయనకు పెళ్లి కాలేదు. అనూజ్సాహూ తమ్ముడైన అరుణ్సాహూ జార్ఖండ్ నుంచి అన్న ఆచూకీ కోసం సోమవాం దోమలపెంటకు వచ్చాడు. అరుణ్ సాహూను దోమలపెంటలో ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా.. జార్ఖండ్ రాష్ట్రంలోని గుంలా జిల్లాలో చిన్నగ్రామం. ము గ్గురు అన్నదమ్ములం.
తల్లిదండ్రులు వృద్ధులు. పెద్దన్న అనూజ్సాహూ మూ డేళ్ల కింద దోమలపెంటకు పనిచేసేందుకు వచ్చాడు. పనిచేసి ప్రతినెలా పంపి ంచే డబ్బుతో కుటుంబం గడిచేది. అన్న టన్నెల్లో చిక్కుకుపోయిండని ఇక్కడున్న మా వాళ్లు ఫోన్‌చేసి చెబితే వచ్చా. ఇక్కడకు వచ్చి చూస్తే పరిస్థితి బాగాలేదని తెలిసింది. రేపు ఉదయం మానాన్న కూడా ఇక్కడికి చేరుకుంటాడు. మా అన్నను ఒక్కసారి చూడాలనుంది. తెలంగాణ సర్కారుకు మొక్కుతున్న. తొందరగా మా వాళ్లను తీయండి. బతికి ఉంటే అప్పగించండి.. చనిపోతే శవాన్ని ఇప్పించండి. మా ఊరికి తీసుకెళ్తామని వేడుకున్నాడు… మిగిలిన ముగ్గురు జార్ఖండ్ కార్మికుల కుటుంబాలు కూడా సోమవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకొని మంగళవారం దోమలపెంటకు చేరుకోనున్నాయి.
చిక్కుకున్న 8మందిలో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు మిషన్ డ్రైవర్లు, నలుగురు జార్ఖండ్ కార్మికులు ఉన్నారు. జార్ఖండ్ కార్మికుల్లో సందీప్సాహూ, జక్త్తాకేస్కు పెళ్లికాలేదు. సంతోష్సాహూకు వివాహమైంది. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంతోష్ కోసం బావమరిది, జక్త్తాకేస్ కార్మికుడి కోసం తమ్ముడు, సందీప్సాహూ కోసం తండ్రి వస్తున్నట్లు తోటి కార్మికులు తెలిపారు. లోపల చిక్కుకున్న వారి గురించి ప్రతిరోజూ వారి కుటుంబ సభ్యులు నిత్యం ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారని.. మేము ఏం చెప్పలేకపోతున్నామని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటగంటకు బయటకు వచ్చారా అంటూ అడుగుతున్నారని తెలిపారు. కుటుంబాలు వారి కోసం ఎదురుచూస్తున్నారని కార్మికులు తెలిపారు.