మహబూబ్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 19: పాలమూరు పట్టణంలో సమస్యలు లేకుండా అభివృద్ధి చేసేందుకే వార్డు పర్యటన చేపట్టినట్లు ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం పాలకొండ నుంచి పర్యటనకు శ్రీ కారం చుట్టారు. ముందుగా ఆంజనేయస్వామి ఆల యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాలకొం డ, ప్రేమ్నగర్కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌లోని మనికొండస్థాయిలో పాలకొండ అభివృద్ధి చెందిందని, భూముల డిమాండ్ పెరిగిందన్నారు. పాలకొండలో ఒక్క ఇంటిని కూల్చకుండా రోడ్డు విస్తరణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఒకప్పుడు సమస్యలకు నిలయంగా ఉండే ప్రేమ్‌నగర్ ప్రస్తుతం అభివృద్ధికి చిరునామాగా మారిందన్నారు. కొందరు నాయకులు ఎన్నికలప్పుడు కులం, మతం పేరుతో రాజకీయం చేస్తూ ఓట్లు దండుకున్నారని, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే కుట్రలు చేస్తారని, ఇలాంటి వారికి ప్రజలే బుద్ది చెప్పాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రేమ్‌నగర్‌కు చెందిన మోబిన్ అనే యువకుడు అనారోగ్యంతో అపస్మారక స్థితిలోకి వెళ్తే తాము ఏమీ చేయలేమని యువకుడి తల్లిదండ్రులు వదిలేసి వెళ్లారని.. సమాచారం తెలిసిన తాము వెంటనే హైదరాబాద్‌కు తరలించి యువకుడిని కాపాడామని మంత్రి గుర్తుచేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవచేస్తానని మంత్రి వెల్లడించారు.
మహబూబ్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 19: జిల్లాకేంద్రంలో త్వరలో అధునాతన క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సంత్ సేవలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకొని గోర్ బంజారా ప్రీమియర్‌లీగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం బోయపల్లి సమీపంలోని ఎండీసీఏ మైదానంలో నిర్వహిస్తున్న జీబీపీఎల్-5 క్రికెట్ టోర్నీని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గిరిజన సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాకేంద్రంలో బంజారాభవన్, సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే గిరిజన విద్యార్థులకు వసతిగృహం, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. రూ.12కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 19: ఆర్యసమాజం ధర్మవైపు నడపిస్తుందని, ప్రతిఒక్కరూ ఆ దిశగా నడవాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ కళాభవన్‌లో మహర్షి దయానంద సరస్వతీ ద్విశతాబ్ది పరంపర ‘గ్రంథావిష్కరణకు మంత్రి హాజరై మాట్లాడారు. అలాగే ఆర్యవైభవం మాస పత్రికను మంత్రి ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజివెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, మున్సిపల్ వైస్‌చైర్మన్ తాటిగణేశ్, కౌన్సిలర్లు నరేందర్, కిశోర్, బాలేశ్వరి, ఆర్యవైభవం మాసపత్రిక సంపాదకుడు తూము సుభాష్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత బా ద్మి శివకుమార్, విఠల్‌రావు, ప్రజ్ఞా శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ పొద్దుటూరి ఎల్లారెడ్డి, డాక్టర్ మురళీధర్, చంద్రయ్య, బాలయ్య, రాంచంద్రయ్య, రాజేశ్వరీ, కవులు శాంతారవీందర్రెడ్డి, జగపతిరావు, కిష్టయ్య, నాయకులు పాపరాయుడు, ఖాజాపాషా, క్రికెట్ టోర్నీ నిర్వాహకులు, రవిరాథోడ్, రవీందర్‌నాయక్, వెంకట్‌నాయక్, వినేశ్, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్రాములు, జగపతిరావు, రామకృష్ణ పాల్గొన్నారు.