ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అండగా నిలుస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ పథకంలో భాగంగా అందించే రూ.లక్షా 116తో ఆడబిడ్డలు ఉన్న పేదింటి పెండ్లి బాజాలు మోగుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా మారి సాయం అందజేస్తున్నారన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లో 71 మందికి రూ.71.08 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అలాగే సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అద్భుతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు.
పాలమూరు, జనవరి 12 : ప్రజలకు ఏ కష్టం వచ్చి నా నిరంతరం అందుబాటులో ఉంటానని, ఎప్పుడైనా వచ్చి కలవొచ్చని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ మండల పరిష త్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ సుధాశ్రీ ఆధ్వర్యంలో 71 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో ఆడబిడ్డల పెండ్లికి కనీసం రూ.5 వేలైనా సాయం చేశారా అని ప్రశ్నించారు. కానీ నేడు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.1.00.116 ఆర్థికసాయం అందజేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పక్క రా ష్ర్టాల్లో భూతద్దం పెట్టి వెతికినా దొరకదన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్, ఎస్పీ వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ జిల్ల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, సింగిల్ విండో చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, తాసిల్దార్ పాం డునాయక్, ఆర్ఐ క్రాంతికుమార్‌గౌడ్, సర్పంచుల సం ఘం మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ టౌన్, జనవరి 12 : మహబూబ్‌నగర్ పట్టణాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం అద్భుతమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఏనుగొండ పరిధిలోని వివేకానందనగర్‌లో రూ.70 లక్షలతో ని ర్మించిన బీటీ రోడ్డు, పోచమ్మ కాలనీలో హైమాస్ట్ లై ట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక మహబూబ్‌నగ ర్ పట్టణాన్ని నలువైపులా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోచమ్మకాలనీ, ఏనుగొండ, మిగతా కాలనీలను లింక్‌రోడ్డు ద్వారా బైపాస్కు కలుపుతామని, దీంతో సిద్దాయపల్లి, అమిస్తాపూర్‌కు వెళ్లే వారికి ఉపయోగకరంగా ఉంటుదన్నారు.
ప్రతి వార్డు లో మున్సిపల్ చైర్మన్, అధికారులు, కౌన్సిలర్లతో కలిసి పర్యటించి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అ నంతరం కాలనీలో పాదయాత్ర చేసి సమస్యలను తెలుసుకున్నారు. కొత్తగా గృహ నిర్మాణాలు చేపట్టిన ద్వారకాపురి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని వారు కోరగా.., సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌ న్సిలర్లు వనజ, రోజా, రవికిషన్‌రెడ్డి, అనంతరెడ్డి, కి శోర్, నాయకులు శివరాజ్, వినోద్, వెంకటేశ్, నర్సింహులుయాదవ్, జైపాల్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.