అభివృద్ధిలో తెలంగాణది అగ్రస్థానం
తెలంగా ణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో ని లిచిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజా, ప్రభుత్వ ప్రతినిధులు గడిచిన తొమ్మిదిన్నరేండ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధిని చూసి ఇంత తక్కు వ సమయంలో ఎలా చేశారని ఆశ్చర్యపోయేవారని నిరంజన్‌రెడ్డి చెప్పారు.
- దశాబ్ది ఉత్సవాల్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితోనే రాష్ట్ర సాధన: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
వనపర్తి, జూన్ 3(నమస్తే తెలంగాణ) : తెలంగా ణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో ని లిచిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజా, ప్రభుత్వ ప్రతినిధులు గడిచిన తొమ్మిదిన్నరేండ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధిని చూసి ఇంత తక్కు వ సమయంలో ఎలా చేశారని ఆశ్చర్యపోయేవారని నిరంజన్‌రెడ్డి చెప్పారు. సోమవారం తెలంగాణ దశా బ్ది ఉత్సవాల్లో భాగంగా బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరిం చి మాట్లాడారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ కు పదేండ్లు నిండాయన్నారు. జూన్ 2న రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఎందరో అమరుల త్యాగఫలం గా సాకారమైందన్నారు. నాడు కేసీఆర్ ప్రారంభించిన ఉద్యమం వెలకట్టలేనిదని, రాష్ట్ర సాధన అనంతరం అభివృద్ధిలోనూ బీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తితో నే దూసుకువెళ్లిందన్నారు. దేశంలోని ఇతర రాష్ర్టాల కంటే తెలంగాణ అభివృద్ధిలో ముందు వరుసలో ని లిచిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అ న్నారు. 14 ఏండ్లు పోరాటంతోనే ఇక్కడి ప్రజల కో రిక నెరవేరిందన్నారు.
స్వరాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి చెం దిందన్నారు. ఉమ్మడి జిల్లాలో కృష్ణా నీటిని పారించి పసిడి పంటలకు నిలయం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సీఎం సొంత జిల్లాలోనే బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించి రేవంత్‌రెడ్డికి పాలమూరు ప్రజలు ఝలక్ ఇచ్చారన్నారు. ప్రభుత్వం నుంచి ఎంత ఒ త్తిడి వచ్చినా.. ప్రలోభాలకు లొంగకుండా మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పని చేయడంతోనే బీఆర్ఎస్ గెలుపు సాధ్యమైందన్నారు. ఇందుకు కష్టపడిన వారందరికీ ఆర్ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. కా ర్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి అభిలాష్‌రావు, ఎంపీపీలు కృష్ణానాయక్, గుంత మౌనిక, జెడ్పీటీసీలు రఘుపతి రెడ్డి, సామ్యానాయ క్, నాయకులు లక్ష్మయ్య, తిరుమల్, నాగన్నయాదవ్, అశోక్, పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

