మక్తల్ : షాహిద్ భగత్ సింగ్ (Bhagat Singh) , రాజ్గురు స్ఫూర్తితో యువకులు దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీపీఎం మాస్ లైన్ నారాయణపేట జిల్లా నాయకులు కిరణ్, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ పిలుపునిచ్చారు. భగత్ సింగ్ వర్ధంతి (Bhagat Singh Anniversary ) సందర్భంగా మక్తల్ పట్టణ కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
జిల్లా కార్యదర్శి అజయ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. బ్రిటిష్ ( British) బానిస సంకెళ్లు తెంచి , భారతదేశ ప్రజలకు నిజమైన స్వాతంత్ర స్వేచ్ఛ సమానత్వం కాంక్షించిన వ్యక్తి భగత్ సింగ్ అని అన్నారు. నేటి పాలకులు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, నిరుద్యోగులుగా నిలబెట్టి మతం, కులాల పేరుతో గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
ఎంతో ఉన్నతాశయంతో దేశాన్ని వదలి అమెరికాకు వెళితే ట్రంపు సంకెళ్ల తో బంధించి పశువుల మాదిరిగా తిరిగి దేశానికి పంపిస్తున్నారని ఆరోపించారు. దేశ యువతకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఆలోచించాలని డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన మోదీ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల విషయాన్ని మర్చిపోయారని విమరించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి సంధ్య, నాయకులు అజయ్, గోపి, జ్యోతి వెంకటేష్, స్వాతి, పౌర్ణమి, నానీ రాజు తదితరులు ఉన్నారు .