వనపర్తి, ఆగస్టు 1 : మారుతున్న కాలానికనుగుణం గా ఎదుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులతో మంగళవారం సోషల్‌మీడియా శిక్షణా శిబిరం ఏర్పాటు చే శారు. సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలతో ప్రజల ముందుకెళ్లాలని శిక్షకుడు సత్యప్రసాద్ పెద్దపల్లి వివరించారు. నియోజకవర్గ స్థాయిలో జరిగిన అభివృద్ధికి సం బంధించిన డాక్యుమెంటరీని మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీవితం ఎన్నో విషయాలు నేర్పుతుందని, ప్రజలకు ఏమీ తెలియదనుకుం టే మన పొరపాటే అవుతుందన్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా.. వనపర్తిలో జరిగిన అభివృద్ధిని గమనిం చి 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. గతంలో వార్తలు ప్రజలకు చేరాలంటే ఉత్తరాలు, ల్యాండ్ఫోన్లు ఉండేవని, ప్రచారం చేయాలంటే గోడరాతలు, బట్టబ్యానర్లు, చిన్న జీపులు ఉంటే సరిపోయేదన్నారు. నేడు ఆధునిక యుగంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు.
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఒకప్పటి దూరదర్శన్ స్థానంలో వందల న్యూస్ ఛానళ్లు.., రెండు, మూడు పత్రికల స్థానంలో వేల పత్రికలు వచ్చాయన్నా రు. మారిన వార్తా ప్రపంచంలో పత్రికలు, సోషల్ మీడియాదే అగ్రస్థానం అని అన్నారు. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలకు దీటుగా వనపర్తిని అభివృద్ధి చేశామన్నారు. ఎక్కడా లేని విధంగా వనపర్తిలో 64 మినీలిఫ్ట్లను ఏర్పాటు చేశామని, జేఎన్టీయూ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల, దేశంలోనే తొలి వ్యవసాయ డిగ్రీ కళాశాలను నెలకొల్పామన్నారు. సొంత డబ్బులతో క్షయ వ్యాధి గ్రస్తులకు అందజేస్తున్న బలవర్థక ఆహారాన్ని కేం ద్ర మంత్రి మాన్సుక్ మాండవీయ అభినందించారన్నా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో చెక్‌డ్యాంలను నిర్మిస్తున్నామన్నారు. మరో 11 అడ్డుకట్లను మంజూరు చేశారన్నారు. మంత్రిగా ఉండి రాష్ట్రంలో అత్యధిక పల్లెనిద్రలు చేసినట్లు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో దివంగత సాయిచంద్ అందించిన సేవలు మరువలేనివన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాసులు ఎదురుకుంటున్న కష్టాలు, జీవన విధానం, తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన అభివృద్ధి, సంక్షేమపథకాలపై పా టలు పాడి అందరి మదిలో సుస్థిర స్థానం సాధించాడన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, బీఆ ర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ గట్టుయాద వ్, జిల్లా అధికార ప్రతినిధి, మున్సిపల్ వైస్‌చైర్మన్ వా కిటి శ్రీధర్, జిల్లా శిక్షణా తరగతుల చైర్మన్ పురుషోత్తంరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త వంగూరు ప్రమోద్‌రెడ్డి, సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.