మహబూబ్‌నగర్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మి స్తున్న వట్టెం రిజర్వాయర్‌లో ఐదు బాహుబలి పంపులను మన ఇంజినీర్లు రెడీ చేశారు. గురువారం మొదటి పంపు విజ యవంతంగా పరీక్షించడంతో ఇంజినీర్ల ఆనందం అంతా ఇం త కాదు. మిగతా నాలుగు పంపులు కూడా డ్రైరన్‌కు సిద్ధంగా ఉన్నట్లు ఇంజినీరింగ్ అధికారులు ప్రకటించారు.
పాలమూరు పథకంలో భాగంగా ప్రధానమైన పాత్ర పోషించే వట్టెం రిజర్వాయర్ పూర్తి కావడం.. పంప్‌హౌస్‌లోని మోటార్లన్నీ సిద్ధం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలు ఉమ్మడి మహబూబ్ నగర్‌తోపాటు పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు వెళ్తాయి. భవిష్యత్‌లో రాజధాని నగరానికి కూడా తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం కీలక ఘట్టం పూర్తి కావడం.. ఈ పథకానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ ప్రయత్నం సఫలీకృతమైంది.
రాష్ట్రంలో అధికారం చేప ట్టిన కాంగ్రెస్ ప్రభు త్వం మాత్రం పాలమూ రు ప్రాజెక్టుపై శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సాక్షాత్తు సీఎం రేవంత్ సొంత జిల్లాలో సుమారు 13 లక్షల ఎకరాలకు నీరు అందించే ఈ బృహత్ పథకానికి గ్రహణం పట్టించడం గమనార్హం. కాగా ఇటీవల కురిసిన వర్షాలకు కృ ష్ణానది ఉప్పొంగి వందలాది టీఎంసీల నీరు సముద్రం పాలైంది.
మన జిల్లాకు వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ ప్రయత్నం జరగకపోవడంతో ఏపీ కృష్ణానది జలాలను భారీ ఎత్తున తరలించుకుపోయింది. ఫలితంగా పాలమూరు ఎత్తి పోతల పథకం పనులు దాదాపు 80 శాతం పూర్తయినా కాంగ్రెస్ సర్కారులో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. అయినప్పటి కీ గతంలో బీఆర్ఎస్ ప్ర భుత్వం ఇచ్చిన ని ధులతోనే వట్టెం పంప్‌హౌస్ రిజ ర్వాయర్ పను లు పూర్తి కావ డం అప్పటి ప్ర భుత్వం చిత్త శుద్ధి ని తెలియజేస్తోంది.
కరువు కాటకాలతో వలసలకు నిలయ మై న పాలమూరు జి ల్లాను సస్యశ్యామలం చేయాలని ఉద్దేశంతో కేసీఆర్ఈ ఎత్తిపోతల ప థకానికి శ్రీకారం చుట్టా రు. కొల్లా పూర్ సమీపంలోని నార్లాపూర్ వద్ద పాలమూరు ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ నిర్మించి రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. అక్కడి నుంచి నార్లాపూర్ రిజర్వాయర్‌కు చేరిన నీళ్లు ఆ తర్వాత ఏదుల రిజ ర్వాయర్కు వెళ్తాయి. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న ఏదుల వరకు గ్రావిటీ ద్వారా తరలించి.. అక్కడి నుంచి ఎత్తిపోస్తారు. ఏదుల రిజర్వాయర్‌లో సుమారు 9 టీఎంసీల నీటిని నిల్వ చేసే విధంగా డిజైన్ చేశారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నాగర్ కర్నూల్ జిల్లాలోని వట్టెం పంప్ హౌస్‌కు చేరతాయి.
ఇక్కడ ఎత్తిపోసిన నీళ్లు వట్టెం రిజర్వాయర్లు నిల్వ చేస్తారు. సుమారు 19 టీఎంసీల నీటి నిల్వ చేసే విధంగా భారీ రిజర్వాయర్ నిర్మించారు. ఇక్కడి నుంచి గ్రావిటీ ద్వారా కరివెన రిజర్వా యర్‌లోకి నీళ్లు మళ్లిస్తారు. కరివెన రిజర్వాయర్ కెపాసిటీ 19 టీఎంసీలు కాగా మరికొంత పెంచేందుకు వెసులుబాటు కూడా ఉన్నది. అక్కడి నుంచి ఉదండాపూర్ పంప్‌హౌస్‌కు గ్రావిటీ ద్వారా తరలించి ఉదండాపూర్ రిజర్వాయర్‌కు ఎత్తిపోస్తారు. ఇక్కడి నుంచి నారాయణపేట జిల్లా.. రంగారెడ్డి జిల్లా.. వికారాబాద్ జిల్లాతోపాటు నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో గరిష్ఠంగా రూ.13 లక్షలు.. కనిష్ఠంగా రూ.10 లక్షల ఎకరాలు సాగవుతాయి. బీఆర్ఎస్ హయాంలో ఈ పథకం పనులు శరవేగంగా సాగినా.. గతేడాది పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఈ ఏడాది వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు వట్టెం పంప్‌హౌస్‌లోకి భారీగా వరద నీరు చేరి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. నాగర్‌కర్నూల్ జిల్లా సమీపంలోని నాగనూలు చెరువు అలుగు పారి గొలుసు కట్టు చెరువుల వరదకు నీళ్లన్నీ పోటెత్తి సమీపంలోని వట్టెం పంప్‌హౌస్ సొరంగంలోకి మళ్లిపోయాయి. దీంతో 24 గంటల్లోనే వట్టెం పంప్‌హౌస్ మొత్తం నీట మునిగింది. దాదాపు పది నుంచి 12 టీఎంసీల నీరు చేరడంతో భారీ నష్టం సంభవించింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో.. పనులన్నీ నత్తనడకన సాగాయి. నీళ్లను తోడేందుకు కూడా నయాపైసా విధించలేదు. పైగా ఒక్క మంత్రి ఎమ్మెల్యే కూడా పంప్ హౌస్ సందర్శించకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
వట్టెం పంప్‌హౌస్‌లో మొత్తం 10 బాహుబలి మోటార్లు బిగించారు. 9 మోటర్లు నీటిని ఎత్తిపోసే విధంగా డిజైన్ చేశారు. ఒక మోటర్‌ను స్పేర్‌గా ఉంచారు. ఈ పది మో టర్లలో ఐదు మోటర్లు పూర్తిస్థాయిలో రెడీ చేశారు. రాష్ట్రం లోని ప్రతిష్టాత్మక సంస్థ అయిన బీహెచ్ఈఎల్ ఈ మోటర్లను డిజైన్ చేసింది. అక్కడే స్పేర్ పార్ట్స్ తయారుచేసి పంప్‌హౌస్‌లోని నాలుగు అంతస్తు లోప లికి తీసుకెళ్లి బిగించారు. ఒక్కో మోటరు 24 గంటల్లో ఒక టీఎంసీని ఎత్తిపోస్తుంది. ఈ విధంగా 10 మోటర్లు సిద్ధమయ్యాయి. దాదాపు సగం మోటర్లు పూర్తి కావడంతో వట్టెం పంపు పూర్తిగా వాడుకోవచ్చు. ఒక పంపు ట్రయల్న్ అధికారులు సక్సెస్ ఫుల్‌గా పరీక్షించి చూశారు. మిగతా పం పులకు కూడా ఒకటి, రెండు రోజుల్లో డ్రైర న్ను పూర్తి చేస్తామని పాలమూరు ప్రాజెక్టులోని పరిధిలోని వట్టెం సర్కిల్ ఈఈ పార్థసారథిరెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. మొత్తంపైన వట్టెం రిజర్వాయర్ కంప్లీట్ కావడంతో అన్నదాతల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినా పాలమూరు ఎత్తిపోతలను పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. ఎక్కడ కేసీఆర్‌కు పేరొస్తుందోనన్న భయంతో ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రైతులకు సాగునీరు.. గ్రామాలకు తాగునీరు అందించే ఈ బృహత్తర పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇటీవల మహబూబ్‌నగర్‌లో సీఎం, మంత్రులందరినీ ప్రాధేయపడి రూ.లక్ష కోట్లు ఐదేళ్లలో తీసుకొస్తానని చెప్పారని.. దాంట్లో పదో వంతు పాలమూరు ప్రాజెక్టుకు కేటాయిస్తే పనులు పూర్తయి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. వట్టెం రిజర్వాయర్ పంపులు పూర్తిస్థాయిలో బిగించిన అధికారులు, ఇంజినీర్లకు ఆయన అభినందనలు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో విడుదల చేసిన నిధుల ద్వారా అని ఇప్పటివరకు పనులు పూర్తయ్యాయని.. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేసి రైతులకు సాగునీరు ఇవ్వకపోతే చరిత్రలో రేవంత్ జిల్లాకు మొండిచేయి చూపినవారిగా నిలిచిపోతారని ఎద్దేవా చేశారు.