జడ్చర్ల, మే 20 : అర్హులకే డబుల్ బెడ్రూం ఇం డ్లు కేటాయించనున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారె డ్డి తెలిపారు. శనివారం జడ్చర్ల మున్సిపాలిటీలోని 22వ వార్డులో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటింటికీ తి రిగి ప్రజల ఆర్థిక పరిస్థితులను గమనించారు. స్థ లం ఉన్నవారిని గృహలక్ష్మి పథకానికి ఎంపిక చేయ గా.. అద్దె ఇంట్లో ఉంటున్న వారిని డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించేందుకు ఎంపిక చేశారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ ఆప్యాయంగా పలకరించారు. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఉంటే వారికి ‘డబు ల్’ ఇండ్లను మంజూరు చేస్తున్నారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇం డ్లను అర్హులైన లబ్ధిదారులకే పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఇంటింటి తిరుగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే అధికారులు దరఖాస్తులు స్వీకరించి సర్వే చేశారన్నారు. పైరవీలకు తావు లేకుండా రూ.లక్ష లు విలువ చేసే ఇండ్లను అందజేస్తున్నామన్నారు. పట్టణంలో వివిధ చోట్ల నిర్మాణ దశలో ఉన్న 1400 డబుల్బెడ్రూం ఇండ్లకు కూడా త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తానన్నారు. నియోజకవర్గంలో 2 వేల ఇండ్లు నిర్మిస్తున్నామని, జూన్ మొద టి వారంలో ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రెండు రోజుల తర్వాత 6వ వార్డులో ప ర్యటిస్తానన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై కాంగ్రెస్ నాయకులు కేసులు వేయడం వల్లే పనులు ఆలస్యమయ్యాయన్నారు. లేకుంటే కాళేశ్వరం కంటే ముందే పూర్తయ్యేదన్నారు. జూరాల కు కేవలం వరద నీరు మాత్రమే వస్తుందని, శ్రీ శైలం బ్యాక్‌వాటర్ ఎప్పుడూ ఉంటుందని, అందు కే అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయనున్నట్లు చెప్పా రు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించినా ప్రతిపక్షాలు అడ్డుకోవని.. కానీ ఇక్కడ మాత్రం విరుద్ధం గా ఉందన్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన ప్రాజెక్టులు దాదాపు పూర్తయ్యావని, ఉదండాపూర్ కూడా త్వరలోనే పూర్తవుతుందన్నారు. ఉ దండాపూర్ ముంపు బాధితులకు త్వరలోనే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వస్తుందన్నారు. పునరావాస కేం ద్రంలో డ్రైనేజీలు తదితర పనులు జరుగుతున్నాయన్నారు. జడ్చర్లలో దాదాపు రూ.30 కోట్లతో ని ర్మించిన వంద పడకల దవాఖానను ఈనెల 27వ తేదీన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, తాసీల్దార్ ల క్ష్మీనారాయణ, కమిషనర్ మహమూద్‌షేక్, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, శ్రీశైలమ్మ, నర్సింహులు, రమే శ్, ఉమాశంకర్‌గౌడ్, ముడా డైరెక్టర్లు శ్రీకాంత్, ఇం తియాజ్, వెంకటేశ్, అంజిబాబు, విక్కి ఉన్నారు.