తిమ్మాజిపేట, జూలై 20 : విద్యుత్ సమస్యపై చేగుంట గ్రామస్తులు శుక్రవారం గొరిట సబ్‌స్టేషన్ వద్ద నిర్వహించిన ఆందోళనపై విద్యుత్ అధికారులు స్పందించారు. శనివారం సబ్‌స్టేషన్‌ను టీజీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ భిక్షపతి పరిశీలించారు. ఈ సందర్భం గా చేగుంట, గొరిటకు చెందిన రైతులతో మాట్లాడా రు.
రెండు గ్రామాల్లో విద్యుత్ సమస్య ఉన్నదని, వా టిని గుర్తించామన్నారు. రెండు గ్రామాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్త్తామన్నారు. 15రోజుల్లో సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. గొరిట సబ్‌స్టేషన్‌లో ఇప్పుడు న్న 5.1ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్కు అదనంగా మరో 3.15ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ అమర్చుతామన్నారు. ఆయన వెంట డీఈ శ్రీధర్‌శెట్టి, ఏడీ ఆదిశేషయ్య, ఏఈ సాయన్నగౌడ్ ఉన్నారు.