గద్వాల అర్బన్, జూన్ 24 : యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు, బూడిద నిల్వల మెయింటెనెన్స్‌కు సంబంధించిన విషయంలో సంబంధిత నిర్వాహకులు ప్రైవేట్ వ్యక్తులకు టెండర్లు వేసి పిలవడం సరైనది కాదని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్ఈ కార్యాలయం ఎదుట బుధవారం విద్యుత్ శాఖ అధికారులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు నిల్వల నిర్వాహకులకు ఇచ్చిన టెండర్ నోటీస్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీఈ నాగరాజు, ఏడీఈలు రమేశ్‌బాబు, బాబు మక్బూల్, పులికొండ, అధికారులు రామకృష్ణ, అశోక్, ప్రవీణ్, సురేశ్, రజిత, వంశీక, శ్రీయుక్త, లక్ష్మి, నగేశ్, పరమేశ్, సుధాకర్, రహనాబేగం ఉన్నారు.