లింగాల : ప్రభుత్వ పాఠశాలలలో ఆంగ్ల ( English) బోధన జరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా రిసోర్స్ పర్సన్ నెహ్రూ ప్రసాద్ (DRP Prasad) అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న మండల స్థాయి శిక్షణ తరగతులను ( Training Classes ) పరిశీలించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల బోధన చేస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యాబోధన అందుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. బడి ఈడు. బడి బయట పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బషీర్ అహ్మద్, ఆర్పీలు బాలాంజనేయులు , సౌజన్య, ఆజాద్, వెంకటేశ్వర్లు, జ్యోతి పాల్గొన్నారు.