కల్వకుర్తి, ఫిబ్రవరి 6 : దుందుభీ నదిని ఇసుకాసురులు తోడేస్తున్నారు. అభివృద్ధి పనులు, గృహ నిర్మాణ అవసరాలకు ఇచ్చిన అనుమతుల ముసుగులో అడ్డగోలుగా రవాణా చేస్తున్నారు. ఇసుక కొరతను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ టిప్పర్ ఇసుక ను రూ.40 వేలకుపైగా విక్రయిస్తున్నారు. కల్వకుర్తి, అచ్చంపేట,నాగర్‌కర్నూల్‌తోపాటు పలు ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నా రు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వంగూరు మండలం పోతారెడ్డిపల్లి, ఉల్పర గ్రా మాల సమీపంలోని దుందుభీ వాగులో ఇసుక తీయడానికి రీచ్‌లను అధికారులు గుర్తించారు. అభివృద్ధి పనులతోపాటు డొమెస్టిక్ ఇసుక తీయడానికి డీఎల్ఎస్సీ అధికారులు అనుమతులిచ్చారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో మాత్రమే సరఫరా చేసే విధంగా ప్రొసీడింగ్‌లు ఉన్నాయి. అభివృద్ధి పనులకు ఇసుక సరఫరా చేసేందుకు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తు లు నిర్వహణ కమిటీకి దరఖాస్తు చేసుకున్నారు. సీ నరీజ్ చార్జెస్ కింద కమిటీలో గతనెల 2న ఒకరు రూ.4.80 లక్షలు ధరావత్తు చేయగా.. మరో వ్యక్తి రూ.10.68 లక్షలు డిపాజిట్ చేశాడు. దీంతో జనవరి 5న నిర్వహించిన డీఎల్ఎస్సీ సమావేశం లో ఇసుక రవాణాకు వీరికి అనుమతులు ఇచ్చారు. ఒకరికి 60 టిప్పర్లు, మరొకరికి 133 టిప్పర్ల ఇసుకను తరలించాలని నిర్ణయించింది.
60 టిప్పర్ల ఇసుకను సరఫరా చేసే కాంట్రాక్టర్ జనవరి 16వ తేదీ నుంచి 25 రోజులపాటు, 133 ట్రిప్పుల కాంట్రాక్టర్ గతనెల 11తేదీ నుంచి 30 రోజులపాటు రీచ్‌ల నుంచి ఇసుక తరలించాలి. ఒక టిప్పర్‌లో కేవలం 15 క్యూబిక్ మీటర్ల ఇసుకను మాత్రమే నింపాలి. అంటే బరువుగా లెక్కిస్తే టిప్ప ర్ ఇసుక 15 నుంచి 17 టన్నులలోపు మాత్రమే ఉండాలి. 60 ట్రిప్పర్ల కాంట్రాక్టర్‌కు 900 క్యూ బిక్ మీటర్లు, 133 టిప్పర్ల కాంట్రాక్టర్‌కు 2000 క్యూబి క్ మీటర్ల ఇసుకను కేటాయిస్తూ అధికారులు ప్రొసీడింగ్‌లు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వే బిల్లులు కూడా ఇచ్చారు.
ప్రభుత్వ అభివృద్ధి పనులతోపాటు గృహ అవసరాలకు సరఫరా చేయాల్సిన ఇసుకను యథేచ్ఛగా బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక టిప్పర్‌లో 15 క్యూబిక్ మీటర్ల ఇసుకను నింపాల్సి ఉండగా.. 35 నుంచి 40 క్యూ బిక్ మీటర్లకుపైగా ఇసుక నింపుతున్నారు. దాదాపు 17 టన్నుల బరువు ఇసుకను సరఫరా చేయాల్సిన టిప్పర్లు 40 టన్నులకుపైగా ఇసుకను సరఫరా చేస్తున్నారు. ఉదయం మాత్రమే రీచ్‌ల నుంచి ఇసుకను తీయాలనే నిబంధనలు ఉన్నా.. రాత్రి వేళల్లో కూ డా ఇసుకను తీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
కొన్ని టిప్పర్లు అభివృద్ధి పనులకు ఇసుకను సరఫరా చేస్తుంటే.. మరికొన్ని టిప్పర్లు గృహావసరాల కు విక్రయిస్తున్నాయి. టన్ను ఇసుక రూ.1,100 వరకు లభ్యమవుతున్నది. వంగూరు మండలం పోతారెడ్డిపల్లి, ఉల్పర నుంచి కల్వకుర్తి టిప్పర్ల జా తర సాగుతున్నది. జనవరి 24, 25వ తేదీలతోపా టు ఇసుకను సరఫరా చేశారు. దాదాపు 60 ట్రిప్పు ల కాంట్రాక్టర్ 8 టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. ప్రతి టిప్పర్ రోజుకు మూడు ట్రిప్పులకుపైగానే సరఫరా చేస్తుందని రైతులు చెబుతున్నా రు. అంటే ప్రతి రోజు 24 టిప్పర్ల ఇసుక సరఫరా అవుతున్నది. ఈ లెక్కన చూస్తే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడినట్లే. ప్రతి క్యూబిక్ మీటర్ ఇ సుకకు ప్రభుత్వానికి దాదాపు రూ.534 ఆదాయం సమకూరుతుంది. ఒక క్యూబిక్ మీటర్‌కు సీనరిజ్ చార్జీల కింద డబ్బులు చెల్లించి.. అందినకాడికి దో చుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇసుక సరఫరా విషయాన్ని సంబంధిత అధికారులను అడిగితే అనుమతులు ఉన్నాయి కదా..? అని సమాధానం ఇస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అసలు విషయానికొస్తే అధికార పార్టీ నా యకుల అండదండలతోనే ఈ దందా నడుస్తుందనే ఆరోపణలు లేకపోలేదు. ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటి పోతాయని రై తులు ఆందోళన చెందుతున్నారు. వానకాలం నుం చి వర్షాలు సరిగ్గా కురవలేదని, జనవరి నాటికే కృష్ణా సాగుజలాల కాల్వలు బంద్ అయ్యామని, ఇప్పటికే సాగునీటికి కష్టాలు పడుతుంటే.. కొత్తగా ఈ దందా ఏమిటని దుందుభీ నదీ పరిసరాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.