మల్దకల్, సెప్టెంబర్ 5 : మండలంలోని పెద్దతండా గ్రామ పంచాయతీలో బోరుకు అమర్చిన సింగిల్ఫేస్ మోటర్ కాలిపోయినందునే నీటి సమ స్య తలెత్తిందని ఎంపీడీవో ఆంజనేయరెడ్డి తెలిపా రు. గురువారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘బిందెలతో యుద్ధం’ శీర్షికన వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. పెద్దతండా వాసులతో ఎంపీడీవో ఆంజనేయరెడ్డి, ఏఆర్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మాట్లాడారు.
చేతిపంపుల్లో నీరు మురికిగా వస్తున్నదని గ్రామస్తులు తెలిపారు. ఏప్రిల్లో కొత్త గా బోరు వేశామని, దానిలో నీరు పుష్కలంగా వ చ్చాయని ఎంపీడీవో చెప్పారు. సింగిల్ఫేస్ మోటర్ విద్యుత్ సమస్యతో కాలిపోవడంవల్లే తాగునీటి సమస్య వచ్చిందన్నారు. త్వరలోనే మోటర్ బిగించి సమస్యను పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి నర్సింహులును ఆదేశించారు.