మక్తల్, అక్టోబర్ 28 : మక్తల్ పట్టణానికి కూతవేటు దూరంలో సర్వేనెంబర్ 971లో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని కేసీఆర్ సర్కారు ప్రారంభించింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు నిలిచిపోయాయి. కాగా, కాంగ్రెస్ సర్కా రు అధికారంలోకి వచ్చాక ఇండ్ల నిర్మా ణం కోసం తీసుకొచ్చిన ఇసుకను ప్రస్తు తం అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అండదండలను చూసుకొని కొం దరు నాయకులు రాత్రికి రాత్రే ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు.
రెం డు నెలల కిందట సైతం మాజీ ప్రజా ప్ర తినిధి రెండు టిప్పర్ల ద్వారా ఇసుకను తరలించినట్లు ఆరోపణలున్నాయి. అధికారం ఉందని ఇష్టానుసారంగా ఇసుక ను అక్రమంగా తరలించడం సరికాదని ప్రజలు అంటున్నారు. అధికారులు స్పం దించి ఇసుక తరలించిన వారిపై చర్య లు తీసుకోవాలని కోరుతున్నారు.
మక్తల్ సమీపంలోని డబుల్ బెడ్రూం నిర్మాణాల వద్ద ఉన్న ఇసుకను తరలించిన విషయం తమ దృష్టికి రాలేదు. ఆర్ఐతో వి చారణ చేపట్టి ఇసుక అక్రమంగా తరలించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– సతీశ్‌కుమార్, తాసీల్దార్